ఏపీ మండలిలో రికార్డు స్థాయిలో బిల్లుల ఆమోదం..

|

Dec 17, 2019 | 8:48 PM

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో సోమవారం పలు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులపై అధికార, విపక్ష సభ్యుల మధ్య సుదీర్ఘ  చర్చ జరిగింది. అనంతరం ఆరు బిల్లలకు మండలి ఆమోదం లభించింది. ఆమోదం పొందిన బిల్లుల వివరాలు : 1. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్టం సవరణ బిల్లు 2. ఆంధ్రప్రదేశ్ సంస్కృతిక, వారసత్వపు బోర్డు చట్టం సవరణ బిల్లు 3. ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం- క్రిమినల్ శాసన చట్టం 2019 బిల్లు, ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం […]

ఏపీ మండలిలో రికార్డు స్థాయిలో బిల్లుల ఆమోదం..
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో సోమవారం పలు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులపై అధికార, విపక్ష సభ్యుల మధ్య సుదీర్ఘ  చర్చ జరిగింది. అనంతరం ఆరు బిల్లలకు మండలి ఆమోదం లభించింది.

ఆమోదం పొందిన బిల్లుల వివరాలు :

1. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్టం సవరణ బిల్లు
2. ఆంధ్రప్రదేశ్ సంస్కృతిక, వారసత్వపు బోర్డు చట్టం సవరణ బిల్లు
3. ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం- క్రిమినల్ శాసన చట్టం 2019 బిల్లు, ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం
4. మహిళలు బాలికలపై నిర్దేశిత అపరాధముల కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక న్యాయస్థానం చట్టం 2019 బిల్లు
5. ఆంధ్రప్రదేశ్ ధార్మిక, హిందూ మత సంస్థల, ఎండోమెంట్ చట్టం సవరణ బిల్లు
6. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య క్రమబద్ధీకరణ, పర్యవేక్షణ కమిషన్ చట్టం సవరణ బిల్లులు

మొత్తం 11 కీలక బిల్లులు ప్రవేశపెట్టగా సోమవారం ఆరు బిల్లులు ఆమోదం లభించింది.  కాగా ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మండలిలో రికార్డు స్థాయిలో బిల్లుకు ఆమోదం తెలపడం ఇదే తొలిసారి.