Anadaiah natu mandu: ఆనందయ్య నాటు మందుపై హైకోర్టు విచార‌ణ‌.. కీల‌క కామెంట్స్ చేసిన న్యాయ‌స్థానం

| Edited By: Team Veegam

May 31, 2021 | 6:23 PM

కృష్ణపట్నం ఆనందయ్య తయారు చేసిన కరోనా మందును.. ప్రభుత్వమే పంపిణీ చేయాలంటూ దాఖలైన పిటిషన్​పై హైకోర్టులో విచారణ....

Anadaiah natu mandu: ఆనందయ్య నాటు మందుపై హైకోర్టు విచార‌ణ‌.. కీల‌క కామెంట్స్ చేసిన న్యాయ‌స్థానం
Anadaiah Natu Mandu
Follow us on

కృష్ణపట్నం ఆనందయ్య తయారు చేసిన కరోనా మందును.. ప్రభుత్వమే పంపిణీ చేయాలంటూ దాఖలైన పిటిషన్​పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. 4 రోజులు సమయమిచ్చినా పంపిణీ వివరాలు ఎందుకు సమర్పించలేదని హైకోర్టు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మందు పంపిణీకి సంబంధించి చేపట్టిన చర్యల వివరాలను తమ ముందుంచాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆనంద‌య్య నాటు మందుపై కాసేప‌ట్లో ప్ర‌భుత్వం స‌మీక్ష జ‌రుపుతుంద‌ని గ‌వ‌ర్న‌మెంట్ త‌రుఫు న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు. ప్ర‌భుత్వ స‌మీక్ష త‌ర్వాత  నిర్ణ‌యం త‌మ‌కు తెలపాల‌ని ఆదేశించిన న్యాయ‌స్థానం.. మ‌ధ్యాహ్నం తీర్పు వెల్ల‌డిస్తామ‌ని చెప్పింది.  విచారణను మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు వాయిదా వేసింది. మలికార్జున, ఉమామహేశ్వరరావు అనే వ్యక్తులు ఈ వ్యాజ్యం వేశారు. తిరిగి ఆనందయ్య మందు పంపిణీ ఉంటుందా లేదా అన్న సస్పెన్స్ మ‌రికాసేప‌ట్లో వీడ‌నుంది.

ఆనంద‌య్య నాటు వేసుకున్న రిటైర్డ్ హెడ్ మాస్ట‌ర్ కోటయ్య క‌న్నుమూత‌

నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తయారుచేసిన నాటు మందు తీసుకుని కోలుకున్నట్లు చెప్పిన విశ్రాంత హెడ్‌మాస్టర్ కోటయ్య సోమ‌వారం కన్నుమూశారు. కరోనాతో బాధపడుతున్న కోటయ్య 10 రోజులుగా నెల్లూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆయనకు 4 రోజులుగా వెంటిలేటర్‌ ద్వారా చికిత్స‌ అందిస్తూ వచ్చారు. అయినప్పటికీ ఆరోగ్య పరిస్థితి విషమించి ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు.

Also Read: ఒక్క చేప‌తో వారి సుడి మారిపోయింది.. ఎంత‌కు అమ్మారో తెలిస్తే మైండ్ బ్లాంక్

ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు.. ఇక‌పై ప్రైవేట్ ఆస్ప‌త్రుల దోపిడీకి చెక్