ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు ఏపీ సీఎ జగన్. తాజాగా షెడ్యూల్ కులాల వారికి మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ మాల సంక్షేమ కార్పొరేషన్, మాదిగ కార్పొరేషన్, రెల్లి మరియు ఇతరుల కార్పొరేషన్ లిమిటెడ్లను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగన్.. ఎస్సీ కో ఆపరేటివ్ కార్పొరేషన్ ఎండీకి ఈ మూడు కార్పొరేషన్లకు సంబంధించి ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రచారంలో ఉన్నకాలంలో ఈ అంశంపై పలువురు షెడ్యూల్ కులాల నేతలు చేసిన విఙ్ఞప్తి మేరకు సీఎం జగన్ ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఆయన సామాజిక వర్గాల్లో మార్పులకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.