40 ఏళ్లు దాటిన వారు జాగ్రత్త.. ఏపీ ప్రభుత్వం కీలక సూచనలు..

ఏపీలో కరోనా వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది. ఈ నేపధ్యంలో వైద్యారోగ్య శాఖ సీఎస్ జవహర్ రెడ్డి రాష్ట్రంలోని 40 ఏళ్లు వయసు పైబడిన వారికి కీలక సూచనలు ఇచ్చారు. 

40 ఏళ్లు దాటిన వారు జాగ్రత్త.. ఏపీ ప్రభుత్వం కీలక సూచనలు..
Follow us

|

Updated on: Jun 20, 2020 | 12:39 AM

ఏపీలో కరోనా వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అటు కరోనాతో 40- 60 ఏళ్లు మధ్య వయసు ఉన్నవారు సుమారుగా 36 మంది మరణించడంతో ఏపీ వైద్యారోగ్య శాఖ సీఎస్ జవహర్ రెడ్డి రాష్ట్రంలోని 40 ఏళ్లు వయసు పైబడిన వారికి కీలక సూచనలు ఇచ్చారు.

ఊపిరితిత్తులు, ఆస్తమా సంబంధిత దీర్ధకాలిక రోగాలతో బాధపడుతున్నవారు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కేవలం జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు మాత్రమే కాకుండా శ్వాసకోశ సమస్యలు తలెత్తినా కూడా వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ 104తో పాటుగా, వైఎస్ఆర్ టెలీ మెడిసిన్ 14410 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. లేదా స్థానికంగా ఉండే ఆశా వర్కర్లు, గ్రామ/వార్డు వాలంటీర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. అటు కరోనా నేపధ్యంలో బీపీ, షుగర్, గుండె జబ్బులు ఉన్నవారు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

కాగా,  గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 465 పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రంలో కొత్తగా 376 కేసులు నమోదు కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 70 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 19 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,961కు చేరింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో నాలుగు మరణాలు సంభవించాయి. అందులో కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. దీంతో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 96కి చేరింది. అలాగే 3,960 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు 3,065 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Latest Articles
తక్కువ ధరలో సూపర్ కార్స్ ఇవే.. భద్రత విషయంలో నో రాజీ
తక్కువ ధరలో సూపర్ కార్స్ ఇవే.. భద్రత విషయంలో నో రాజీ
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
ఏపీలో పోలింగ్‎కు ఏర్పాట్లు పూర్తి.. ఈసీ కీలక విషయాలు వెల్లడి..
ఏపీలో పోలింగ్‎కు ఏర్పాట్లు పూర్తి.. ఈసీ కీలక విషయాలు వెల్లడి..
టీ 20 ప్రపంచకప్ జట్టులో మార్పులు! ఆ ప్లేయర్లకు చిగురిస్తోన్న ఆశలు
టీ 20 ప్రపంచకప్ జట్టులో మార్పులు! ఆ ప్లేయర్లకు చిగురిస్తోన్న ఆశలు
గుండెపోటు వచ్చిన వారికి అందించాల్సిన ప్రాథమిక చికిత్స ఇదే..
గుండెపోటు వచ్చిన వారికి అందించాల్సిన ప్రాథమిక చికిత్స ఇదే..
కారు బీమాతో ఎంతో ధీమా.. క్లెయిమ్ చేసే సమయంలో ఆ జాగ్రత్తలు మస్ట్
కారు బీమాతో ఎంతో ధీమా.. క్లెయిమ్ చేసే సమయంలో ఆ జాగ్రత్తలు మస్ట్
ఓట్స్‌తో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు..
ఓట్స్‌తో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు..
ఎండాకాలంలో అమృతమే.. చెరుకు రసం ఎందుకు తాగాలో తెలుసా..?
ఎండాకాలంలో అమృతమే.. చెరుకు రసం ఎందుకు తాగాలో తెలుసా..?
ఇదెక్కడి మాస్ రా మావా..!! డ్యూయల్ రోల్‌లో అల్లు అర్జున్..
ఇదెక్కడి మాస్ రా మావా..!! డ్యూయల్ రోల్‌లో అల్లు అర్జున్..
ఆ టయోటా కారు బుకింగ్స్ రీ ఓపెన్.. రూ.13 లక్షలకే సీఎన్‌జీ కారు
ఆ టయోటా కారు బుకింగ్స్ రీ ఓపెన్.. రూ.13 లక్షలకే సీఎన్‌జీ కారు