AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘రిమెంబరింగ్’: సుశాంత్‌ జ్ఞాపకార్ధంగా.. ఇన్‌స్టాగ్రామ్ ఘన నివాళి..

ఇన్‌స్టాగ్రామ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు గౌరవ నివాళిని అర్పించింది. ఇక నుంచి అతడి ఇన్‌స్టా అకౌంట్ జ్ఞాపకార్ధంగా ఉండనుంది.

'రిమెంబరింగ్': సుశాంత్‌ జ్ఞాపకార్ధంగా.. ఇన్‌స్టాగ్రామ్ ఘన నివాళి..
Ravi Kiran
|

Updated on: Jun 20, 2020 | 12:53 AM

Share

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య యావత్ భారతదేశాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. అతని మరణంతో అభిమానులు, రాజకీయ ప్రముఖులు, పలువురు సెలబ్రిటీలు విషాదంలో మునిగిపోయారు. ‘అతను మాతో, మా మధ్య లేకపోయినా.. అతని మధురస్మృతులు మాత్రం ఎప్పటికీ మా గుండెల్లోనే భద్రంగా ఉంటాయని చాలామంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా సుశాంత్‌ను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.

ఇదే కోవలో ఇన్‌స్టాగ్రామ్ కూడా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు గౌరవ నివాళిని అర్పించింది. ఇక నుంచి అతడి ఇన్‌స్టా అకౌంట్ జ్ఞాపకార్ధంగా ఉండనుంది. సుశాంత్ బయోలో ‘రిమెంబర్’ అనే పదాన్ని జోడించిన ఇన్‌స్టాగ్రామ్.. అకౌంట్ ఎప్పటికీ అలాగే ఉంటుందని పేర్కొంది. ఈ అకౌంట్‌లోకి మరో వ్యక్తి ఎవరూ లాగిన్ కాలేరని.. ఎటువంటి సమాచారాన్ని కూడా మార్చడానికి సాధ్యపడదని తెలిపింది. అతడి ఇన్‌స్టా అకౌంట్‌లో ఉన్న ఫోటోలు, వీడియోలు నెటిజన్లకు కనిపిస్తాయంది. కాగా, సుశాంత్ తన చివరి ఇన్‌స్టా పోస్టును 2020, జూన్ 3వ తేదీన ట్వీట్ చేశాడు. అతడు తన తల్లిని తల్చుకుంటూ ఓ పోస్ట్ పెట్టాడు. ఇక ఇన్‌స్టా ఇలా ఓ చనిపోయిన యాక్టర్ అకౌంట్‌ను మెమోరియల్ పేజిగా మార్చడం ఇదే తొలిసారి.

సుశాంత్ తన కెరీర్‌ను బుల్లితెర సీరియల్స్ ద్వారా ప్రారంభించాడు. ‘పవిత్ర రిష్ట’ మానవ్‌గా టీవీ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత 2013లో ‘కైపోచే’ సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేశాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద విజయం సాధించింది. అలాగే అతను నటించిన ‘కేదార్‌నాధ్‌’, ‘చిచ్చోరే’ సినిమాలు అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. సుశాంత్ చివరిగా ‘దిల్ బెచారా’ అనే సినిమాలో నటించాడు. అతని అంత్యక్రియలు జూన్ 15న ముంబైలో జరిగాయి.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!