ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం..ప్రముఖ గాయకుడు గుండెపోటుతో మృతి
తమిళ సినీ గాయకుడు ఏ.ఎల్.రాఘవన్(87).. తుదిశ్వాస విడిచారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, గుండెపోటుతో చనిపోయారు. ఆయన మృతి పట్ల సినీ వర్గాలు తీవ్ర విచారం వ్యక్తం చేశాయి. రాఘవన్.. 1950లో వచ్చిన తమిళ చిత్రం ‘కృష్ణ విజయం’తో, గాయకుడిగా కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఎందరో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్ తో కలిసి పనిచేశారు. అందులో కేవీ మహదేవన్, ఎస్.ఎం.సుబ్బానాయుడు, ఘంటసాల, విశ్వనాథ్-రామ్మూర్తి, టీవీ రాజు, ఎస్‌పీ కోదండపాణిలాంటి లెజెండ్స్ ఉన్నారు. […]

తమిళ సినీ గాయకుడు ఏ.ఎల్.రాఘవన్(87).. తుదిశ్వాస విడిచారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, గుండెపోటుతో చనిపోయారు. ఆయన మృతి పట్ల సినీ వర్గాలు తీవ్ర విచారం వ్యక్తం చేశాయి. రాఘవన్.. 1950లో వచ్చిన తమిళ చిత్రం ‘కృష్ణ విజయం’తో, గాయకుడిగా కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఎందరో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్ తో కలిసి పనిచేశారు. అందులో కేవీ మహదేవన్, ఎస్.ఎం.సుబ్బానాయుడు, ఘంటసాల, విశ్వనాథ్-రామ్మూర్తి, టీవీ రాజు, ఎస్‌పీ కోదండపాణిలాంటి లెజెండ్స్ ఉన్నారు. ప్రముఖ సింగర్స్.. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, జిక్కి, పి.లీలతోనూ కలిసి ఈయన చాలా పాటలు పాడారు.
తెలుగులో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ నటించిన ‘నిండు మనసులు’, ‘నేనే మెనగాణ్ణి’ చిత్రాల్లో పాటలు పాడారు. ఈ రెండింటికి టీవీ రాజు సంగీత దర్శకుడు అవ్వడం విశేషం. పేకేటి శివరామ్ తెరకెక్కించిన ‘కులగౌరవం’ సినిమాలో ‘హ్యాపీ లైఫ్’ అంటూ సాగే పాటను ఎల్.ఆర్.ఈశ్వరితో కలిసి ఆలపించారు రాఘవన్. రాఘవన్ భార్య ఎం.ఎన్ రాజమ్..నటిగా అందరకీ సుపరిచితురాలే.