ఆంధ్రాలో కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు జ‌గ‌న్ మార్క్ చెక్…

ఆంధ్రాలో కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు జ‌గ‌న్ మార్క్ చెక్...

విద్యా వ్య‌వ‌స్థ‌లో ప‌లు సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌స్తోన్న‌ ఆంధ్రప్రదేశ్‌లోని జ‌గ‌న్ ప్ర‌భుత్వం అదే దిశ‌లో మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు చెక్ పెట్టేలా స‌ర్కార్ నిర్ణయం తీసుకుంది. తాజాగా స్కూళ్లు కాలేజీల అడ్మిషన్ల విషయంలో కటాఫ్ విధించింది. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం.. ఇకపై ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు ఇష్టం వచ్చినంత మంది స్టూడెంట్స్ ను, ఇష్టం వచ్చినన్ని సెక్షన్లు ఏర్పాటు చేసుకోవడానికి వీలు ఉండ‌దు. కొత్త రూల్స్ ప్రకారం ఒక్కో సెక్షన్‌లో అత్యధికంగా […]

Ram Naramaneni

|

May 13, 2020 | 11:50 PM

విద్యా వ్య‌వ‌స్థ‌లో ప‌లు సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌స్తోన్న‌ ఆంధ్రప్రదేశ్‌లోని జ‌గ‌న్ ప్ర‌భుత్వం అదే దిశ‌లో మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు చెక్ పెట్టేలా స‌ర్కార్ నిర్ణయం తీసుకుంది. తాజాగా స్కూళ్లు కాలేజీల అడ్మిషన్ల విషయంలో కటాఫ్ విధించింది. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం.. ఇకపై ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు ఇష్టం వచ్చినంత మంది స్టూడెంట్స్ ను, ఇష్టం వచ్చినన్ని సెక్షన్లు ఏర్పాటు చేసుకోవడానికి వీలు ఉండ‌దు. కొత్త రూల్స్ ప్రకారం ఒక్కో సెక్షన్‌లో అత్యధికంగా 40 మంది విద్యార్థులకు మాత్రమే ప‌ర్మిష‌న్ ఉంటుంది. 4 సెక్షన్ల నుంచి 9 సెక్షన్ల వరకు అనుమతి ఉంటుంది. ఈ విద్యాసంవత్సరం నుంచే కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu