AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ల్యాబ్​లోనే తయారైంది..నితిన్ గడ్కరీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

ప్రపంచ దేశాలను ప‌ట్టిపీడిస్తోన్న కరోనావైర‌స్ మ‌హమ్మారి సహజంగా రాలేదని.. ల్యాబ్​లో తయారు చేసినదే అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు కేంద్ర చిన్న మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌‌మ‌ల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా మాట్లాడారు. ” మనం కరోనాతో కలిసి బతకడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ వైరస్​ సహజంగా వచ్చినది కాదు. ల్యాబ్​లో తయారుచేసినది. ప్రపంచ దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్‌ కనిపెట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. . వీలైనంత త్వరగా […]

కరోనా ల్యాబ్​లోనే తయారైంది..నితిన్ గడ్కరీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..
Ram Naramaneni
|

Updated on: May 14, 2020 | 12:02 AM

Share

ప్రపంచ దేశాలను ప‌ట్టిపీడిస్తోన్న కరోనావైర‌స్ మ‌హమ్మారి సహజంగా రాలేదని.. ల్యాబ్​లో తయారు చేసినదే అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు కేంద్ర చిన్న మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌‌మ‌ల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా మాట్లాడారు.

” మనం కరోనాతో కలిసి బతకడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ వైరస్​ సహజంగా వచ్చినది కాదు. ల్యాబ్​లో తయారుచేసినది. ప్రపంచ దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్‌ కనిపెట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. . వీలైనంత త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాం. అని నితిన్​ గడ్కరీ, వ్యాఖ్యానించారు.

కరోనా విప‌త్క‌ర ప‌రిస్థితులు తీసుకురావ‌డం వ‌ల్ల‌ పరిశ్రమలు ఆర్థికంగా దెబ్బతిన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడిన అంశంపై స్పందించిన గడ్కరీ… ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో అనుకూలతలు క్రియేట్ చెయ్య‌డం సవాలుతో కూడుకున్నదని వ్యాఖ్యానించారు. ఇండియా​ ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కునేందుకు సన్నద్ధంగానే ఉందని అభిప్రాయపడిన గడ్కరీ.. ధైర్యంగా వైరస్​ను ఎదిరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని సూచించారు. కరోనా చైనాలోని ఓ ల్యాబ్‌ నుంచి బయటకు వచ్చిందని ప్ర‌పంచంలోని చాలా దేశాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. అమెరికాతో పాటు బ్రిటన్​, జర్మనీ వంటి దేశాలూ క‌రోనా గురించి చైనాపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన దాఖ‌లాలు కూడా ఉన్నాయి. భారత్‌ మాత్రం ఈ అంశంపై ఇప్పటివరకు ఏ విధ‌మైన కామెంట్స్ చెయ్య‌లేదు. అయితే తొలిసారిగా భారత ప్రభుత్వంలోని భాగస్వామ్యమైన ఓ వ్యక్తి చైనాపై ఈ విధంగా విమర్శలు చేయడం సంచలనమైంది.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..