ఏఎన్ఎంలు, గ్రామ, వార్డు సచివాలయ ఆరోగ్య సహాయకులను సచివాలయ ఆరోగ్య మిత్రలుగా నియమిస్తూ ఏపీలోని జగన్ సర్కార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్యశ్రీకి సంబంధించిన అంశాలన్నీ సచివాలయ ఆరోగ్య మిత్రలు మోనేటర్ చేస్తారని గవర్నమెంట్ ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈఓ సిఫార్సుల మేరకు వైద్యారోగ్యశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
సచివాలయ ఆరోగ్య మిత్రల విధులు
ఈ కార్యకలాపాలకు సంబంధించి సచివాలయ ఆరోగ్య మిత్రలు, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు జిల్లా కోఆర్డినేటర్లకు రిపోర్టు చేయాల్సిందిగా సర్కార్ ఆదేశించింది. అదే క్రమంలో నూతనంగా జారీ చేసిన ఈ మార్గదర్శకాలతో పాటు… ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల జాబితాను కూడా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాల్సిందిగా వైద్యారోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది.
Also Read :