ఎన్నికల కమిషనర్‌తో నేతల భేటీ.. రేపే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్..!

శనివారం ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ తెలిపారు. స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా విజయవాడలోని ఈసీ కార్యాలయంలో రాజకీయ పార్టీలతో ఆయన

ఎన్నికల కమిషనర్‌తో నేతల భేటీ.. రేపే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 06, 2020 | 9:36 PM

శనివారం ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ తెలిపారు. స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా విజయవాడలోని ఈసీ కార్యాలయంలో రాజకీయ పార్టీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశానికి వైకాపా నుంచి ఎమ్మెల్యేలు జోగి రమేశ్‌, అనిల్‌ కుమార్‌, తెదేపా నుంచి వర్ల రామయ్య, ఆలపాటి రాజాతో పాటు పోతిన వెంకట మహేశ్ (జనసేన), వైవీ రావు (సీపీఎం), జెల్లి విల్సన్‌ (సీపీఐ) నాగభూషణం (భాజపా) హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణపై ఆయా పార్టీల నేతలు తమ అభిప్రాయాలను ఎస్‌ఈసీకి తెలిపారు.

వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ.. 2018 లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చింది.స్థానిక సంస్థల ఎన్నికల కు వైసీపీ సిద్ధం. మద్యం డబ్బు ఈ ఎన్నికల్లో ప్రభావితం కాకూడదు అని సీఎం నిర్ణయం తీసుకున్నారు.స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెలాఖరు లోపు జరగాలని పేర్కొన్నారు.

జోగి రమేష్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు లో కేసు ఉంది ఎన్నికలు వాయిదా వేయండి అని మాట్లాడుతున్నారు.సుప్రీంకోర్టు కి వెళ్ళింది మీ పార్టీ కాదా?? ఇంప్లీడ్ పిటిషన్ వేసింది మీరు కాదా అని మండిపడ్డారు. జగన్ ను అభినవ పూలేగా అభివర్ణించారు.

టిడిపి నేత వర్ల రామయ్య మాట్లాడుతూ.. టిడిపి తరపున ఎన్నికల నిర్వహణకు ఇది సరైన సమయం కాదని, కరోనా వైరస్ దాడి, బిసి రిజర్వేషన్లు ఎవరికి సంత్రుప్తినివ్వలేదు. లీగల్ సమస్య తీరకముందే హడావుడిగా ప్రభుత్వం స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహిస్తుందని వాపోయారు.

బిజెపి నేత పాతూరి నాగభూషణం మాట్లాడుతూ.. బిసిల రిజర్వేషన్ అంశంపై మా‌విధానం ఎన్నికల సంఘానికి చెప్పాం. కేంద్రం నుంచి నిధులు రావనే సాకుతో హడావుడి గా ఎన్నికలు నిర్వహించడం సరి కాదు. రిజర్వేషన్ అంశం తేల్చాకే ఎన్నికలు పెట్టాలనేది మా అభిప్రాయం అని వెల్లడించారు.

సిపిఎం నేత వై.వి.రావు మాట్లాడుతూ.. ఎన్నికలు పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని కోరాం. సింగిల్ విండో అనుమతులు ఇచ్వేలా చూడాలని కోరాం. పరీక్షల‌ వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడతారని చెప్పాం. అన్నింటినీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు అని తెలిపారు.

సిపిఐ నేత జల్లి‌ విల్సన్ మాట్లాడుతూ.. కరోనా‌ వైరస్ వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పాం. సకాలంలో ఎన్నికలు నిర్వహించి ఉంటే ఈ ఇబ్బందులు‌ వచ్చేవి కావు. కుల ధృవీకరణ పత్రాలు, ఇతర అనుమతులు వెంటనే ఇవ్వాలని విన్నవించారు.

జనసేన నేత పోతిన మహేష్ మాట్లాడుతూ.. బిసి అభ్యర్థులకు వెంటనే ధృవీకరణ పత్రం ఇచ్చేలా చూడాలని కోరాం. బిసి రిజర్వేషన్ల అంశం కొలిక్కి వస్తే‌ బిసిలకు మేలు జరుగుతుందని చెప్పామని తెలిపారు.

ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రం లో స్దానిక సంస్ధల ఎన్నికల కు పూర్తిగా సన్నద్దమయ్యాం. క్షేత్రస్ధాయిలో ఎన్నికలకు సిద్ధం చేశాం. బ్యాలెట్ పేపర్ లొ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. ఆల్ పార్టీ మీటింగ్ లో రాజకియ పార్టిల్లో విభిన్న అబిప్రాయాలుంటాయని, వారి అబిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నామని తెలిపారు.