అరటి పళ్లు అమ్ముతున్న బడి పంతులు..!

ఏపీలో లాక్ డౌన్ లో జీతాలు ఇవ్వలేమని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం. రోడ్డుపై అరటిపళ్లు అమ్ముతున్న ఉపాధ్యాయుడు

అరటి పళ్లు అమ్ముతున్న బడి పంతులు..!
Follow us

|

Updated on: Jun 05, 2020 | 9:12 PM

బతుకలేక బడి పంతులు అనే పాత సామెతను మరోసారి రుజువు చేసింది కరోనా లాక్ డౌన్. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దీంతో అన్ని వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. వీటితో పాటు విద్యా సంస్థలు మూతపడ్డాయి. దీంతో ఆదాయం కోల్పోయిన ఓ ఉపాధ్యాయుడు రోడ్డుపై అరటిపళ్లు అమ్ముతున్న ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లాకు చెందిన ఒక యువకుడు 15 ఏళ్లుగా ఓ ప్రైవేట్ స్కూలులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. లాక్ డౌన్ లో జీతాలు ఇవ్వలేమని ఆ స్కూల్ యాజమాన్యం తెగేసి చెప్పింది. దీంతో అతని బతుకుచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. కుటుంబ పోషణ సాగాలంటే ఏదో పని చేసుకోవాలని భావించి రోడ్డునపడ్డాడు. వీధుల వెంబడి తిరుగుతూ తోపుడుబండితో అరటిపండ్లు అమ్ముతూ తన బతుకుబండిని లాగుతున్నాడు ఈ టీచర్. మరోవైపు లాక్ డౌన్ పుణ్యామని ఉన్న ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా మారుతున్నారు. వ్యాపార సంస్థలు సైతం గిరాకీలు లేక వ్యయాన్ని తగ్గించుకునే పనిలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నారు. కడుపు నిండ తిండి తినలేక బ్రతుకు జీవుడా అంటూ కాలం వెల్లదీస్తున్నారు.

నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..