Breaking: వివాదాస్పద కథనం.. ఇద్దరిని సస్పెండ్ చేసిన టీటీడీ జేఈవో

టీటీడీ సప్తగిరి మాస పత్రిక చీఫ్ ఎడిటర్ రాధా రమణ, సబ్ ఎడిటర్ ఉత్తర ఫల్గుణపై సస్పెండ్ వేటు పడింది. వారిద్దరిని జేఈవో బసంత్ కుమార్ సస్పెండ్ చేశారు.

Breaking: వివాదాస్పద కథనం.. ఇద్దరిని సస్పెండ్ చేసిన టీటీడీ జేఈవో
Follow us

| Edited By:

Updated on: Jun 05, 2020 | 10:20 PM

టీటీడీ సప్తగిరి మాస పత్రిక చీఫ్ ఎడిటర్ రాధా రమణ, సబ్ ఎడిటర్ ఉత్తర ఫల్గుణపై సస్పెండ్ వేటు పడింది. వారిద్దరిని జేఈవో బసంత్ కుమార్ సస్పెండ్ చేశారు. సప్తగిరి మాస పత్రికలో ఇటీవల ప్రచురించిన లవకుశ కథ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ కథను ఉద్దేశపూర్వకంగా ప్రచురించి టీటీడీకి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేశారనే కారణాలతో వారిద్దరిని సస్పెండ్ చేశారు. 2016లో నిషేధించిన కథనాన్ని పునీత్ అనే తొమ్మిదో తరగతి విద్యార్థి పేరుతో ప్రచురించారని విజిలెన్స్ ఎంక్వయిరీలో తేలింది. దీంతో జేఈవో చర్యలు తీసుకున్నారు. మరోవైపు సప్తగిరి పత్రిక వివాదంపై విచారణ కొనసాగుతోందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.

కాగా టీటీడీ సప్తగిరి మాస పత్రికలో ప్రచురితమైన రామాయణంలోని లవకుశ కథ ఇప్పుడు వివాదంగా మారింది. అందులో సీతకు లవుడు మాత్రమే కుమారుడని, కుశుడు దర్బతో రాసిన బొమ్మ అంటూ ప్రచురించారు. దీంతో టీటీడీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న వైవీ సుబ్బారెడ్డి.. విజిలెన్స్ అధికారుల చేత విచారణ చేయించారు. ఈ క్రమంలో విద్యార్థితో పాటు తండ్రిని విచారిస్తే అసలు విషయం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో సప్తగిరి మాస పత్రిక చీఫ్ ఎడిటర్, సబ్ ఎడిటర్‌పై వేటు పడింది.

Read This Story Also: బన్నీ హిట్ పాట రీమిక్స్‌లో సల్మాన్‌..!

రిజర్వేషన్లపై ఆర్ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్ కీలక వ్యాఖ్యలు
రిజర్వేషన్లపై ఆర్ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్ కీలక వ్యాఖ్యలు
6 అర్థ శతకాలు.. 6సార్లు ఓడిన ముంబై ఇండియన్స్.. తిలక్‌పై ట్రోల్స్
6 అర్థ శతకాలు.. 6సార్లు ఓడిన ముంబై ఇండియన్స్.. తిలక్‌పై ట్రోల్స్
పాటల్లేని విజయ్ సినిమా.. 75 కోట్లు వసూలు చేసిన కేరళలో మూడో సినిమా
పాటల్లేని విజయ్ సినిమా.. 75 కోట్లు వసూలు చేసిన కేరళలో మూడో సినిమా
గతేడాది ఐటీఆర్ దాఖలు చేయని వారికి ఇంకా అవకాశం ఉందా?
గతేడాది ఐటీఆర్ దాఖలు చేయని వారికి ఇంకా అవకాశం ఉందా?
బాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే: సీఎం జగన్
బాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే: సీఎం జగన్
అణు యుద్ధాన్ని తట్టుకునేలా విమానం.. ప్రత్యేకతలు ఇవే!
అణు యుద్ధాన్ని తట్టుకునేలా విమానం.. ప్రత్యేకతలు ఇవే!
పురుషులకు వరం ఈ గింజలు.. తిన్నారంటే ఆ సమస్యలే ఉండవట..
పురుషులకు వరం ఈ గింజలు.. తిన్నారంటే ఆ సమస్యలే ఉండవట..
మండే ఎండల్లో బయటకు వెళ్లేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
మండే ఎండల్లో బయటకు వెళ్లేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
అలాంటి సీన్స్‌లో అస్సలు నటించను.. కారణం ఇదే అంటున్న మృణాల్..
అలాంటి సీన్స్‌లో అస్సలు నటించను.. కారణం ఇదే అంటున్న మృణాల్..
రాలి పోయిన జట్టుతో కూడా జేబు నింపుకోవచ్చు.. ఎలాగంటే!
రాలి పోయిన జట్టుతో కూడా జేబు నింపుకోవచ్చు.. ఎలాగంటే!