AP Corona Cases: ఏపీలో కొత్తగా 1,747 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 65,920 శాంపిల్స్ ని పరీక్షించగా 1,747 మందికి వైరస్ సోకినట్లు....

AP Corona Cases: ఏపీలో కొత్తగా 1,747 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా
Ap Corona
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 23, 2021 | 4:52 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 65,920 శాంపిల్స్ ని పరీక్షించగా 1,747 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1950339కు చేరింది. మరో 14 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 13223కు పెరిగింది. కొత్తగా 24 గంటల్లో 2,365 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1914177కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22939 యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా  కోవిడ్ వల్ల చిత్తూర్ జిల్లాలో నలుగురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, తూర్పు గోదావరి  జిల్లాలో ఒక్క రు, ప్రకాశం జిల్లాలో ఒక్కరు,  విశాఖపట్నం జిల్లాలో ఒక్కరు చొప్పున మరణించారు.

జిల్లాలవారీగా కేసుల వివరాలు దిగువన చూడండి..

దేశంలో కరోనా వివరాలు…

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే గురువారంతో పోలిస్తే పాజిటివ్ కేసులు, మరణాలు తగ్గాయి. కొత్తగా 35,342 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 3,12,93,062కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,05,513 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గురువారం కొత్తగా 38,740 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ కావడంతో.. రికవరీల సంఖ్య 3,04,68,079కి చేరింది. కొత్తగా 483 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 4,19,470 చేరుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటిదాకా 42,34,17,030 వ్యాక్సినేషన్ డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

Also Read:వైఎస్ వివేకా హత్య కేసులో కీలక అప్‌డేట్.. వాచ్‌మన్ రంగయ్య సంచలన వాంగ్మూలం

 మహారాష్ట్రలో పెను విషాదం.. కొండచరియలు విరిగిపడి 36 మంది దుర్మరణం