వరద బాధితులకు రూ. 2 వేల సాయం.. జగన్ సర్కార్ నిర్ణయం..
స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద సహాయక చర్యలు, కరోనా, ఇళ్ల పట్టాలు, ఉపాధి హామీ పనులపై సమీక్ష జరిపారు.

Flood Relief Measures In AP: స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద సహాయక చర్యలు, కరోనా, ఇళ్ల పట్టాలు, ఉపాధి హామీ పనులపై సమీక్ష జరిపారు. ఈ క్రమంలోనే గోదావరి ముంపు బాధితులకు రూ. 2 వేలు సాయంతో పాటు అదనంగా రేషన్ సరకులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 7వ తేదీలోపు ఈ పంపిణీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
అంతేకాకుండా వచ్చే నెల 7వ తేదీ నాటికి పంట నష్టాలపై అంచనాలను రూపొందించాలని అధికారులు సీఎం ఆదేశాలను జారీ చేశారు. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టడంతో రోగాలు ప్రబలకుండా ఉండేలా చర్యలు చేపట్టాలి. వైద్య శిబిరాలను ప్రారంభించి అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలన్నారు. కాగా, త్వరలోనే శ్రీశైలంలో గేట్లు మూసివేసే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు.
Also Read:
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటర్ పరీక్ష రాయకున్నా పాస్.!
