సీఎం జగన్ తిరుమల పర్యటనలో స్వల్ప మార్పు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనలో మరో సారి స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి.

  • Balaraju Goud
  • Publish Date - 12:54 pm, Wed, 23 September 20
సీఎం జగన్ తిరుమల పర్యటనలో స్వల్ప మార్పు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనలో మరో సారి స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ రావడం కాస్త ఆలస్యం అవుతుండడంతో అధికారులు మార్పులు చేశారు. సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్ ఢిల్లీ నుంచి నేరుగా తిరుమలకు చేరుకునే అవకాశం ఉంది. సాయంత్రం 5:30 గంటలకు ప్రధాని నిర్వహించే రాష్ట్ర ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్‌లో అన్నమయ్య భవన్ నుంచి సీఎం పాల్గొననున్నారు. అనంతరం 6:15 గంటలకు శ్రీవారికీ పట్టు వస్త్రాలు సమర్పించేందుకు బేడీ ఆంజినేయ స్వామి ఆలయం వద్దకు సీఎం జగన్ చేరుకోనున్నారు. ఈ రాత్రికి తిరుమలలోనే సీఎం బస చేయనున్నారు. రేపు మరోసారి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సీఎం జగన్ అమరావతికి పయనం కానున్నారు.