CM Jagan Tour Live Updates : విజయనగరంలో సీఎం జగన్ ఇళ్ల పట్టాల పంపిణీ.. గృహ నిర్మాణాలకు భూమి పూజ..
విజయనగరం నియోజకవర్గంలోని గుంకలాం వద్ద 397.36 ఎకరాల్లో 12,301 మంది లబ్ధిదారుల కోసం భారీ లే అవుట్ వేశారు. 1,08,230 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఇళ్లపట్టాలు పంపిణీ చేస్తోంది.

House Patta Distribution : ఏపీలో పట్టాల పంపిణీ అట్టహాసంగా జరిగింది. ముందుగా సీఎం జగన్ విజయనగరంలో వైఎస్సార్ జగనన్న కాలనీలో పైలాన్ అవిష్కరించారు. విస్తీర్ణంలో రాష్ట్రంలోనే అతి పెద్దదైన గుంకలాంలోని వైఎస్సార్ జగనన్న కాలనీలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం గృహ నిర్మాణాలకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఇళ్ల లబ్ధిదారులతో ముఖాముఖిలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.45 గంటలకు తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
LIVE NEWS & UPDATES
-
విజయనగరంలో మెడికల్ కాలేజీకి జనవరిలో టెండర్లు..-సీఎం జగన్
విజయనగరంలో మెడికల్ కాలేజీకి జనవరిలో టెండర్లు.. మార్చి నాటికి మెడికల్ కాలేజీ నిర్మాణం చేపడతామని సీఎం జగన్ తెలిపారు. రెండేళ్లలో తోటపల్లి, తారకరామ తీర్ధసాగరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు. ఏడాదిలోగా రాముడువలస లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
-
రాజమండ్రిలో ఆవా భూముల పేరుతో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు- సీఎం జగన్
రాజమండ్రిలో ఆవా భూముల పేరుతో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారని సీఎం జగన్ తెలిపారు. ప్రభుత్వ భూములను కూడా పేదలకు కేటాయించకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. ఇళ్ల నిర్మాణం ద్వారా 30 రకాల వృత్తిదారులకు ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. చంద్రబాబు, అనుచరుల పిటిషన్ల వల్ల 10 శాతం ఇళ్ల పట్టాల పంపిణీ నిలిచిపోయిందని… న్యాయపరమైన సమస్యలు పరిష్కారం కాగానే మిగిలిన వారందరికీ ఇళ్ల స్థలాలు.. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును చట్టబద్ధ హక్కుగా మార్చానున్నట్లుగా వెల్లడించారు.
-
-
ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కోర్టు ద్వారా స్టే తెచ్చారు-సీఎం జగన్
డిసెంబర్ 25న ఇళ్ల పట్టాలు పంచుతామని తెలిసి 24న కోర్టుకు వెళ్లారని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారో దీన్ని బట్టే తెలుస్తుంది. పులివెందులలో ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కోర్టు ద్వారా స్టే తెచ్చారు. అమరావతిలో 54 వేల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే.. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు ఇలా కుట్ర జరుగుతోందని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
-
చంద్రబాబు అండ్ కో కుట్రలతో రిజిస్ట్రేషన్‌లు జరగలేదు-సీఎం జగన్
లబ్ధిదారుల పేరుతోనే ఇంటి రిజిస్ట్రేషన్ చేయించాలనుకున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. చంద్రబాబు అండ్ కో కుట్రలతో రిజిస్ట్రేషన్‌లు జరగలేదు. లబ్ధిదారులకు కేవలం D పట్టాలు మాత్రమే ఇస్తున్నామని అన్నారు. న్యాయపరమైన చిక్కులు తొలిగిపోగానే లబ్ధిదారులకు అన్ని హక్కులు కల్పిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు.
-
పేదలకు 2.20 లక్షల టిడ్కో ఇళ్లను కట్టిస్తున్నాం-సీఎం జగన్
పేదలకు 2.20 లక్షల టిడ్కో ఇళ్లను కట్టిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఇప్పటి వరకు 30.75 లక్షల ఇళ్లను రెండు దశల్లో పూర్తి చేస్తామని అన్నారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. గుంకలాం లేఅవుట్‌లో 12,301 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని అన్నారు.
-
-
ఇళ్ల పట్టా ఇచ్చే కార్యక్రమం నిరంతర ప్రక్రియ-సీఎం జగన్
గ్రామ/వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా డిస్‌ప్లే చేస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. 90 రోజుల్లో ఇళ్ల పట్టా ఇచ్చే కార్యక్రమం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని అన్నారు.
-
ప్రభుత్వం కడుతున్నది ఇళ్లు కాదు.. ఊళ్లు..-సీఎం జగన్
పేదల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని తెలిపారు. తొలి విడతలో 15.65 లక్షల ఇళ్లను నిర్మించబోతున్నామని తెలిపారు. ఇళ్లు కట్టడమే కాకుండా మరో రూ.7వేల కోట్లతో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. గుంకలాం లేఅవుట్‌లో 12,301 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు.
-
గుంకలాంలో చిన్న నగర పంచాయతీ ఏర్పడబోతుంది-సీఎం జగన్
రాష్ట్రంలో ప్రతి గ్రామంలోను, పట్టణంలోనూ పేదలకు ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షలకుపైగా ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టామని అన్నారు. గుంకలాంలో చిన్న నగర పంచాయతీ ఏర్పడబోతుంది అని వెల్లడించారు. గుంకలాం లేఅవుట్‌లో 12,301 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
-
రైతన్నలకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి అండగా నిలబడ్డాం-సీఎం జగన్
రైతన్నలకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి అండగా నిలబడ్డామని ముఖ్యమంత్రి జగన్ గుర్తు చేశారు. 62 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్, ప్రతి పేద కుటుంబానికి ఆస్తి, స్థిరాస్తి అందించే ఈ కార్యక్రమాన్ని చేపట్టాని సీఎం జగన్ అన్నారు.
-
అక్కచెల్లెమ్మలకు మంచి చేసే అవకాశం నాకు దక్కింది- సీఎం జగన్
అక్క చెల్లెమ్మలకు మంచి చేసే అవకాశం తనకు దక్కిందని ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయపడ్డారు. దేశ చరిత్రలోనే లేని విధంగా మహిళలకు, రైతులకు, విద్యార్థులకు అక్కచెల్లెమ్మలకు, సామాజిక వర్గాలకు అండగా నిలచామని సీఎం జగన్ అన్నారు. 50 లక్షలకు పైగా రైతులకు రైతుభరోసా సాయం అందించామని తెలిపారు.
-
మహిళా సాధికారతలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శం-పుష్పశ్రీవాణి
మహిళా సాధికారతలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శం అని ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నారు అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ అండగా నిలిచారు వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్.. మహిళా సాధికారత ఛాంపియన్ అని పుష్ప శ్రీవాణి అన్నారు.
-
సొంతింటి కలను ముఖ్యమంత్రి జగన్ నిజం చేశారు-మంత్రి బొత్స సత్యనారాయణ
సొంతింటి కలను ముఖ్యమంత్రి జగన్ నిజం చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రజల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా సీఎం ముందుకెళ్తున్నారు అని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇల్లు కూడా కట్టిస్తున్నారని మంత్రి బొత్సా వెల్లడించారు.
-
మరికొద్దిసేపట్లో గుంకలాంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ..
మరికొద్దిసేపట్లో గుంకలాంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి, ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. అదే విధంగా అక్కడ నిర్మించిన నమూనా ఇంటిని పరిశీలిస్తారు. సభావేదిక వద్ద ఇళ్ల లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో సీఎం జగన్ పాల్గొంటారు.
-
వైఎస్సార్ జగనన్న కాలనీలోని పైలాన్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విస్తీర్ణంలో రాష్ట్రంలోనే అతి పెద్దదైన గుంకలాంలోని ‘వైఎస్సార్ జగనన్న కాలనీ’ పైలాన్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు.
-
విజయనగరం నియోజకవర్గంలోని పేదల ఇంటి కల నెరవేరుతోంది..-ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విజయనగరం నియోజకవర్గంలోని పేదల కల నెరవేరిందని అన్నారు.
-
విజయనగరం జిల్లాలో 1,08,230 మంది లబ్ధిదారులు..
విజయనగరం జిల్లాలో 1,08,230 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఇళ్లపట్టాలు పంపిణీ చేస్తోంది. దీనిలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన 65,026 మంది, పట్టణ ప్రాంతాలకు చెందిన 43,204 మంది లబ్ధిదారులు ఉన్నారు.
-
‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ లబ్దిదారుల కోసం భారీ లే అవుట్..
విజయనగరం నియోజకవర్గంలోని విజయనగరం రూరల్ మండలం గుంకలాం వద్ద 397.36 ఎకరాల్లో 12,301 మంది లబ్దిదారుల కోసం భారీ లే అవుట్‌ను సిద్ధం చేశారు. రూ.4.37 కోట్లతో లే అవుట్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. పేదలకు స్థలాలు ఇచ్చేందుకు గానూ ప్రభుత్వం.. 428 మంది రైతుల నుంచి 101.73 కోట్ల రూపాయలతో భూమిని కొనుగోలు చేసింది.
