‘దిశ’ బిల్లుకు ఆమోదం… హద్దు దాటితే హతమే…
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి సుచరిత దిశ- 2019 బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇక ఈ బిల్లుపై సుదీర్ఘంగా చర్చ జరిగిన అనంతరం స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. అధికార, ప్రతిపక్ష నేతలందరూ కూడా బిల్లుకు పూర్తి మద్దతు తెలపడంతో బిల్లు ఆమోదం పొందింది. కాగా, ఈ కొత్త చట్టం ద్వారా మహిళలపై నేరాలకు పాల్పడేవారికి 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి, 21 రోజుల్లో శిక్షలు విధించేలా చర్యలు […]

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి సుచరిత దిశ- 2019 బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇక ఈ బిల్లుపై సుదీర్ఘంగా చర్చ జరిగిన అనంతరం స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. అధికార, ప్రతిపక్ష నేతలందరూ కూడా బిల్లుకు పూర్తి మద్దతు తెలపడంతో బిల్లు ఆమోదం పొందింది. కాగా, ఈ కొత్త చట్టం ద్వారా మహిళలపై నేరాలకు పాల్పడేవారికి 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి, 21 రోజుల్లో శిక్షలు విధించేలా చర్యలు తీసుకోనున్నారు. అంతేకాక ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి శిక్షల అమలులో జాప్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోనుంది. ఇకపై సామాజిక మాధ్యమాల్లో మహిళలపై అసభ్యంగా పోస్టింగ్స్ చేసేవాళ్లకి కూడా.. రెండు సంవత్సరాల కారాగార శిక్షతో పాటు, లక్ష రూపాయల జరిమానా విధిస్తారు. ఈ నూతన చట్టంతో దిశ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టనున్నారు.
ఈ బిల్లుపై జగన్ మాట్లాడుతూ.. గత రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉండేవని.. విప్లవాత్మక చర్యలు తీసుకుంటేనే మార్పు సాధ్యమవుతుందన్నారు. నేరం చేసింది ఎంతవారైనా కూడా వదిలే సమస్య లేదని.. దిశ లాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ స్పష్టం చేశారు.
