గంటా గారొచ్చేశారోచ్..! మౌనం వీడే సమయం వచ్చిందా?

గంటా శ్రీనివాస్ రావు… దాదాపు మూడు నెలలుగా టిడిపి నుంచి వైసీపీకిగానీ, బిజెపికిగానీ జంప్ అవుతారంటూ కథనాలు వస్తూనే వున్నాయి. వారం క్రితం తాను టిడిపిలో కొనసాగుతానని ఆయన ప్రకటించడంతో ఈ చర్చకు తెరపడినట్లేనని అందరూ భావించారు. చెప్పనైతే చెప్పారు కానీ గంటా రూటు మారిన దాఖలాలేవీ కనిపించలేదు. విశాఖలో తన సొంత పనుల్లోనే ఆయన గడిపారు ఆ తర్వాత కూడా. ఏపీ అసెంబ్లీ ప్రారంభమై అయిదురోజులు. శుక్రవారం దాకా గంటా శ్రీనివాస్ రావు అసెంబ్లీ వైపు […]

గంటా గారొచ్చేశారోచ్..! మౌనం వీడే సమయం వచ్చిందా?
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 13, 2019 | 7:20 PM

గంటా శ్రీనివాస్ రావు… దాదాపు మూడు నెలలుగా టిడిపి నుంచి వైసీపీకిగానీ, బిజెపికిగానీ జంప్ అవుతారంటూ కథనాలు వస్తూనే వున్నాయి. వారం క్రితం తాను టిడిపిలో కొనసాగుతానని ఆయన ప్రకటించడంతో ఈ చర్చకు తెరపడినట్లేనని అందరూ భావించారు. చెప్పనైతే చెప్పారు కానీ గంటా రూటు మారిన దాఖలాలేవీ కనిపించలేదు. విశాఖలో తన సొంత పనుల్లోనే ఆయన గడిపారు ఆ తర్వాత కూడా.

ఏపీ అసెంబ్లీ ప్రారంభమై అయిదురోజులు. శుక్రవారం దాకా గంటా శ్రీనివాస్ రావు అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడలేదు. అసెంబ్లీలో హాట్ హాట్‌గా పాలక ప్రతిపక్షాలు తలపడుతున్నాయి. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ చంద్రబాబును ఎద్దేవా చేస్తూ వైసీపీ నేతలు చెడుగుడు ఆడుకుంటున్నారు. చంద్రబాబుకు అండగా నిలిచే ఎమ్మెల్యేలు సభలో పెద్దగా లేరు. అచ్చెన్నాయుడు, గోరంట్ల వంటి కొందరు మాత్రం ఎంతో కొంత ఫైట్ చేస్తున్నామనిపిస్తున్నారు.

ఇలాంటి కీలక సమయంలో పార్టీ ఎమ్మెల్యేగా అధినేతకు సభలో అండగా వుండాల్సిన గంటా శ్రీనివాస్ రావు.. తొలి నాలుగు రోజులు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఏపీ అసెంబ్లీలో రచ్చ రంబోలా అవుతుంటే గంటా శ్రీనివాస్ రావు నింపాదిగా విశాఖలో వుండిపోవడం ఏంటన్న చర్చ టిడిపిలో కూడా జోరుగా జరిగింది.

తీరా శుక్రవారం సభకు వచ్చినా.. తెలుగుదేశం ప్రొటెస్ట్‌లో గంటా శ్రీనివాస్ రావు పాల్గొనలేదు. సింపుల్‌గా తన సీట్లోకి వెళ్ళి కూర్చున్నారు. సభలో హాజరు వేయించుకునేందుకు మాత్రమే వచ్చినట్లు కనిపించారు గంటా. ఎక్కడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో పెద్దగా మాట్లాడిన దాఖలాలు కనిపించలేదని చెబుతున్నారు ఆయన్ని పరిశీలించిన వారు.

పార్టీలో వుంటానంటూనే వ్యూహాత్మక మౌనం పాటిస్తున్న గంటా అంతరంగం ఏంటన్నది అర్థం కావడం లేదని అసెంబ్లీ కార్యక్రమాలను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ కీలక విషయం ఆయన అనుచర వర్గం వెల్లడించింది. శీతాకాల సమావేశాలు ముగిసే నాటికి గంటా నిర్ణయం వెలువడుతుందన్న ప్రచారాన్ని ఆయన అనుచర వర్గం మొదలు పెట్టింది. మరి ఈ ప్రచారంలో నిజమెంతా అనేది తేలాల్సి వుంది.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..