నేను అలా కూర్చోలేను.. కానీ తినగలను .. ప్రెగ్నెన్సీ పై అనుష్క శర్మ ఆసక్తికరమైన పోస్ట్.. నెటిజన్లు ఫిదా..

బాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క శర్మ, భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీలు తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అనుష్క నిండు గర్బిణీ.

నేను అలా కూర్చోలేను.. కానీ తినగలను .. ప్రెగ్నెన్సీ పై అనుష్క శర్మ ఆసక్తికరమైన పోస్ట్.. నెటిజన్లు ఫిదా..
Rajitha Chanti

|

Dec 16, 2020 | 6:18 PM

బాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క శర్మ, భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీలు తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అనుష్క నిండు గర్బిణీ. 2021 జనవరిలో వీరు ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. అయితే ఎప్పుడూ అనుష్క సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటూ తన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. తాజాగా అనుష్క తన ఇన్‏స్టాగ్రామ్‏లో చేసిన పోస్ట్ వైరల్‏గా మారింది. అనుష్క తన ఇన్‏స్టాలో అప్పట్లో తాను దిగిన ఓ ఫోటో షేర్ చేస్తూ.. “నేను మళ్ళీ ఎప్పుడు ఇలా కూర్చోని తింటాను.. ఇప్పుడు నేను తినగలను.. కానీ ఇలా కూర్చోలేను” అని క్యాప్షన్ పెట్టింది.

అటు ప్రెగ్నెంట్‏గా ఉన్న సమయంలో యోగా సెషల్‏లో పాల్గొంటూ, ప్రెగ్నెంట్‏గా ఉన్న సమయంలో తీసుకుంటున్న జాగ్రత్తల గురించి.. దరించాల్సిన దుస్తులు గురించి.. ఈ సమయంలో వీలైనంత సంతోషంగా ఉండాలని మహిళలకు తనదైన శైలీలో సూచనలిస్తుంది అనుష్క. ఇటీవల తను ఓ కమర్షియల్ యాడ్‏లో కూడా నటించింది. పాపులర్ ప్రెగ్నె్న్సీ కిట్ ప్రెగా న్యూస్ కోసం అనుష్క నటించింది. అందులో పింక్ డ్రెస్‏ దరించి.. చక్కని చిరునవ్వు, ఎక్స్‏ప్రెషన్స్‏తో అందంగా నటించారు.

డెలివరీ అయిన నాలుగు నెలల అనంతరం అనుష్క తిరిగి సినిమాల్లో నటించనున్నట్లుగా సమాచారం. అటు వారి బిడ్డ జన్మించిన తర్వాత విరాట్ కూడా పెటర్నటీ సెలవులు తీసుకోనున్నాడు. అనంతరం అడిలైడ్‏లో జరిగే మొదటి టెస్ట్ కోసం తిరిగి విరాట్ జాయిన్ కానున్నాడు.

View this post on Instagram

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu