Anupama Tweets: ‘ప్రేమమ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి.. ‘అఆ’ చిత్రంతో ఫ్యాన్స్ మనసులు దోచేసిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం ఈమె తమిళంలో రెండు చిత్రాలు చేస్తుండగా.. తెలుగులో ‘రాక్షసుడు’ మూవీతో సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ కేరళ కుట్టి రీసెంట్‌గా తన పుట్టినరోజు జరుపుకుంది.
Also Read: Thala Ajith Kumar Craze In Twitter
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్టు పెట్టి తనకు 24 ఏళ్లు వచ్చాయంటూ చెప్పకనే చెప్పింది. అంతేకాక సముద్రపుటంచున సేద తీరుతున్న ఓ దంపతుల ఫోటోను పెడుతూ ‘నువ్వు నేను ఈ అందమైన ప్రపంచంలో’ అంటూ కామెంట్ కూడా చేసింది. దీనితో అనుపమ ప్రేమలో పడిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.
ఇదొక్క హింట్ మాత్రమే కాదు.. అటు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా తన ఇన్‌స్టా అకౌంట్‌లో సరిగ్గా అనుపమను అనుకరిస్తున్న పోస్టు ఒకటి పెట్టడంతో ఇప్పుడు వీరిద్దరే నెట్టింట్లో హాట్ టాపిక్. ఇద్దరి మధ్య సంథింగ్.. సంథింగ్ అని ఫ్యాన్స్ విపరీతమైన కామెంట్స్ చేస్తున్నారు.