Breaking News
  • దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభన గడచిన 24 గంటల్లో అత్యధికంగా 24, 879 పాజిటివ్ కేసులు నమోదు కాగా 487 మంది మృతి. దేశంలో కరోన బాధితుల సంఖ్య 7, 67, 296 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. 2, 69, 789 మందికి కొనసాగుతున్న చికిత్స. కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 4, 76, 378 మంది బాధితులు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 21, 129 మంది మృతి.
  • మూడో రోజు కొనసాగుతున్న సచివాలయం కూల్చివేత పనులు. భారీ బందోబస్తు మధ్య పనులు.. దారులన్నీ మూసివేత. నాలుగు బ్లాకులతో పాటు పాత భవనాలు నేలమట్టం. సమాంతరంగా ఇతర బ్లాకుల్లో కూల్చివేత పనులు. మరో మూడు రోజుల్లో కూల్చివేత పనులు పూర్తి. 15రోజుల పాటు అర్ధరాత్రి వేళ శిధిలాల తరలింపు. వారం పాటు సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.
  • యూపీ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అరెస్ట్. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌లో అరెస్ట్. కొద్ది రోజుల క్రితం డీఎస్పీ సహా 8 మంది పోలీసులను కాల్చి చంపిన వికాస్ దూబే గ్యాంగ్. వికాస్ దూబే కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి గాలింపు. వరుసగా అనుచరుల ఎన్‌కౌంటర్, తాజాగా వికాస్ అరెస్ట్.
  • ప్ర‌ముఖ న‌టుడు, హాస్య‌న‌టుడు జ‌గ్ దీప్ క‌న్నుమూత‌. స‌య్య‌ద్ ఇష్తియాక్‌ అహ్మ‌ద్ జాఫ్రీ అలియాస్ జ‌గ్‌దీప్ క‌న్నుమూశారు. ఆయ‌న‌కు 81 ఏళ్లు. 1939 మార్చి 29న జ‌న్మించిన జ‌గ్‌దీప్‌. 400ల‌కు పైగా చిత్రాల్లో న‌టించిన జ‌గ్‌దీప్‌. షోలే, పురాణ మందిర్‌, అందాజ్ అప్నా అప్నా చిత్రాల‌తో మంచి పేరు. బాల న‌టుడిగా బి.ఆర్‌.చోప్రా అఫ్సానాతో ప‌రిచ‌యం. అబ్ దిల్లి దూర్ న‌హీ, కె.ఎ.అబ్బాస్ చిత్రం `మున్నా`, గురు ద‌త్ చిత్రం `ఆర్ పార్‌`, భిమ‌ల్ రాయ్ చిత్రం `దో బిగా జ‌మీన్‌` చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా న‌టించిన జ‌గ్‌దీప్.
  • హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్. వాహనదారులు హెల్మెట్ ధరించి బైక్ నడపండి. నిన్న గోపాల్‌పురంలో ఒక వ్యక్తి బైక్ పై వెళ్తూ జారిపడి తలకు గాయమైంది.. తరువాత ఆసుపత్రిలో మరణించాడు. బహుశా అతను హెల్మెట్ ధరించి ఉంటే బ్రతికి ఉండేవాడు.. హెల్మెట్ మీ భద్రత కోసం.. పోలీసుల తనిఖీ కోసం కాదు. బైక్ పై వెళ్లేవారు తప్పకుండా హెల్మెట్ పెట్టుకుని ప్రయాణం చేయండి.
  • విశాఖ: కేజీహెచ్ వైరాలజీ ల్యాబ్ లో కరోనా కలకలం. టెస్ట్ లు నిర్బహించే ముగ్గురు టెక్నీషియన్లకు కరోనా పాజిటివ్. ల్యాబ్ లో సేవలందించే 20 మందికి పరీక్షలు.. అందరికీ నెగెటి. వైరాలజీ ల్యాబ్ లో సేవలు తాత్కాలికంగా నిలిపివేత.. ల్యాబ్ లో శానిటైజ్ చేస్తున్న జీవీఎంసీ సిబ్బంది. ప్రత్యామ్నాయంగా కేజీహెచ్ లోని నాకో ల్యాబ్ ను వినియోగిస్తున్న వైద్య సిబ్బంది.

#GetWellSoonTHALA ట్రెండింగ్.. అజిత్ క్రేజ్ మాములుగా లేదుగా…

తమిళ స్టార్ హీరోల్లో రజినీకాంత్ తర్వాత తలా అజిత్ కుమార్‌కు మాస్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనకు ఇటీవల 'వాలిమై' షూటింగ్‌లో గాయాలైన సంగతి తెలిసిందే. అజిత్ ఎక్కువగా డూప్‌లు లేకుండానే యాక్షన్  స్టంట్స్ చేస్తుంటారు.
GetWellSoonTHALA, #GetWellSoonTHALA ట్రెండింగ్.. అజిత్ క్రేజ్ మాములుగా లేదుగా…

GetWellSoonTHALA: తమిళ స్టార్ హీరోల్లో రజినీకాంత్ తర్వాత తలా అజిత్ కుమార్‌కు మాస్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనకు ఇటీవల ‘వాలిమై’ షూటింగ్‌లో గాయాలైన సంగతి తెలిసిందే. అజిత్ ఎక్కువగా డూప్‌లు లేకుండానే యాక్షన్  స్టంట్స్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే సినిమాలోని ఓ బైక్ సీక్వెన్స్‌‌ను తెరకెక్కిస్తుండగా ప్రమాదవశాత్తు ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. దీనితో చిత్ర యూనిట్ వెంటనే షూటింగ్ ఆపేశారు. అరగంట పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత హీరో అజిత్ తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నారు.

Also Read: Anupama In Love

ఇదిలా ఉంటే తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని ఆయన ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా పోస్టులు పెట్టారు. అందులో భాగంగానే #GetWellSoonTHALA అనే హ్యాష్‌ట్యాగ్‌తో దాదాపు 83 వేల ట్వీట్లు చేయడం విశేషం. ప్రస్తుతం ట్విటర్‌ ఈ హ్యాష్‌ట్యాగ్ ఇండియా ట్రెండింగ్‌లో ముందు వరుసలో ఉంది. కాగా, ‘వాలిమై’ చిత్రంలో అజిత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. హెచ్.వినోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత బోణీ కపూర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నై పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది.

Related Tags