బ్రేకింగ్: ఆ విద్యార్థులకు మరోసారి నీట్

ఢిల్లీ: రైలు ఆలస్యంగా రావడంతో వైద్య ప్రవేశ పరీక్ష నీట్‌ రాయలేకపోయిన విద్యార్థులకు మరో అవకాశం ఇస్తామని  కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్‌ సోమవారం వెల్లడించారు. మే 20న ఆ విద్యార్థులకు పరీక్ష నిర్వహించనున్నామని ఆయన ట్వీట్ చేశారు. ‘రైలు ఆలస్యంగా రావడం వల్ల నీట్ రాయలేకపోయిన విద్యార్థులకు మరో అవకాశం ఇస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం’ అని ఆయన ట్వీట్ చేశారు. కర్ణాటకలో రైలు ఆలస్యంతో 300లకు పైగా విద్యార్థులు బెంగళూరులోని పరీక్షా కేంద్రానికి షెడ్యూల్ సమయానికి […]

బ్రేకింగ్: ఆ విద్యార్థులకు మరోసారి నీట్
Follow us
Ram Naramaneni

|

Updated on: May 06, 2019 | 8:09 PM

ఢిల్లీ: రైలు ఆలస్యంగా రావడంతో వైద్య ప్రవేశ పరీక్ష నీట్‌ రాయలేకపోయిన విద్యార్థులకు మరో అవకాశం ఇస్తామని  కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్‌ సోమవారం వెల్లడించారు. మే 20న ఆ విద్యార్థులకు పరీక్ష నిర్వహించనున్నామని ఆయన ట్వీట్ చేశారు. ‘రైలు ఆలస్యంగా రావడం వల్ల నీట్ రాయలేకపోయిన విద్యార్థులకు మరో అవకాశం ఇస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం’ అని ఆయన ట్వీట్ చేశారు. కర్ణాటకలో రైలు ఆలస్యంతో 300లకు పైగా విద్యార్థులు బెంగళూరులోని పరీక్షా కేంద్రానికి షెడ్యూల్ సమయానికి చేరుకోలేకపోయారు. దీంతో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ అంశాన్ని ట్విటర్ వేదికగా లేవనెత్తిన  కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ప్రధాని నరేంద్ర మోదీని ట్యాగ్‌ చేస్తూ విమర్శలు చేశారు. మొదటి సారి ఈ పరీక్షను నిర్వహిస్తోన్న నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి మార్పులుండవని తెలిపింది. సైక్లోన్‌ ఫొని కారణంగా ఒడిశా రాష్ట్రంలో నీట్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా మే 20న పరీక్ష నిర్వహిస్తామని ఎన్‌టీఏ అధికారులు వెల్లడించారు.