ఎయిర్ టెల్ నుంచి మరో బంపరాఫర్

భారత టెలికాం సేవల సంస్థ ఎయిర్ టెల్ మరో శుభవార్తను తమ వినియోగదారులకోసం మోసుకొచ్చింది. బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఎయిర్‌టెల్ తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్

  • Pardhasaradhi Peri
  • Publish Date - 9:00 pm, Sat, 5 September 20
ఎయిర్ టెల్ నుంచి మరో బంపరాఫర్

భారత టెలికాం సేవల సంస్థ ఎయిర్ టెల్ మరో శుభవార్తను తమ వినియోగదారులకోసం మోసుకొచ్చింది. బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఎయిర్‌టెల్ తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ అయిన బేసిక్, ఎంటర్‌‌టైన్‌మెంట్, ప్రీమియం, వంటి వాటికి డేటా పరిమితిని తీసేస్తుంది. ప్రస్తుతం అన్ని ప్లాన్ల వినియోగదారులకు అపరిమిత డేటా ఆఫర్‌ ఇవ్వనుంది. మరోవైపు రూ. 299 అన్‌లిమిటెడ్ డేటా యాడ్ ఆన్ ప్యాక్‌ను తొలగించింది. అయితే అపరిమిత డేటా ప్రయోజనం 3300 జీబీ ఎఫ్‌యూపీ క్యాప్‌తో అందుబాటులోకి రానుంది. ఎయిర్‌టెల్‌ తాజా ఆఫర్‌కు సంబంధించిన వివరాలను ఎయిర్‌టెల్‌ వెబ్‌సైట్‌, మై ఎయిర్‌టెల్‌ యాప్‌లో పెట్టనున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. ఎయిర్‌టెల్‌ తాజా నిర్ణయం.. తమ వినియోగదారులు జియోకు మారకుండా ఉండేందుకు దోహదం చేస్తుందని కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి. కాగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్ సర్కిళ్లలో ఎయిర్‌టెల్ కొన్ని బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లపై అపరిమిత డేటాను అందిస్తోంది.