వైఎస్ వివేకా హత్య కేసు అప్ డేట్…

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. 12వ రోజు కూడా విచార‌ణ కొనసాగనుంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ చేస్తున్నారు సీబీఐ అధికారులు.

వైఎస్ వివేకా హత్య కేసు అప్ డేట్...
Follow us

|

Updated on: Jul 29, 2020 | 9:24 AM

YS Viveka murder case :మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. 12వ రోజు కూడా విచార‌ణ కొనసాగనుంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ చేస్తున్నారు సీబీఐ అధికారులు. నిన్న సీబీఐ విచారణకు వివేకా కుమార్తె సునీత హాజర‌య్యారు. సెంట్రల్ జైల్లో ఉన్న గెస్ట్ హౌస్ లో ప్రత్యేక విచారణ అధికారి నేతృత్వంలో సునీతను 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు సీబీఐ అధికారులు. హత్య జరిగిన రోజు నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని పరిస్థితులపై సునీతను ద‌గ్గ‌ర్నుంచి వివ‌రాలు సేక‌రించారు. ఆమె స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. ఇవాళ కూడా మరికొందరిని విచారించే అవకాశం ఉంది.

కాగా గ‌త‌ ఆదివారం సిట్ దర్యాప్తు నివేదికను పులివెందుల పోలీసులు సీబీఐకి అప్పగించారు. 3 బ్యాగుల్లో ఉన్న నివేదికలను స్వాధీనం చేసుకున్న సీబీఐ ఆఫిస‌ర్స్..కీల‌క అనుమానితుల‌పై ఫోక‌స్ పెట్టారు. ఇప్పటికే 15 మంది అనుమానితుల లిస్ట్ రెడీ చేసినట్లు సమాచారం. ఆ జాబితాలో వైఎస్​ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, బాబాయ్ మనోహర్ రెడ్డితో పాటు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, బీజేపీ నేత‌ ఆదినారాయణరెడ్డి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

Read More : ఆస్తి పన్ను బకాయిదారులకు తెలంగాణ స‌ర్కార్ బంపర్ ఆఫర్..