AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఛీ.. ఛీ.. దుర్మార్గుడా.. అత్తమామల మీద కోపంతో అల్లుడు ఏం చేసాడో తెలుసా..?

అత్తమామల మీద కోపంతో బావమరిదిని కిడ్నాప్ చేసి అతి దారుణంగా హత్య చేశాడు బావ.. అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలుడు హేమచంద్ర కిడ్నాప్ విషాదంగా ముగిసింది. మెడకు తాడు బిగించి.. రాళ్లతో కొట్టి ఐదేళ్ల బావమరిదిని.. బావ చంపాడు... స్కూల్ బస్సు దిగి ఇంటికి వెళుతున్న బావమరిదిని తినుబండారాలు కొనిస్తానని బైక్ పై ఎక్కించుకొని... తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో అతి దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది.

Andhra: ఛీ.. ఛీ.. దుర్మార్గుడా.. అత్తమామల మీద కోపంతో అల్లుడు ఏం చేసాడో తెలుసా..?
Anantapur Child Murder Case
Nalluri Naresh
| Edited By: |

Updated on: Mar 26, 2026 | 6:33 PM

Share

ఆస్తికోసం.. అత్తమామలు తన భార్యను, తనను సరిగా చూడడం లేదని అల్లుడు దారుణ నిర్ణయం తీసుకున్నాడు.. అత్తమామల మీద కోపంతో.. బావమరిదిని దారుణంగా హత్య చేశాడు.. ఈ షాకింగ్ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామానికి చెందిన గోవింద్, కాంతమ్మ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఒక అబ్బాయి సంతానం ఉన్నారు.. పెద్ద కుమార్తె లలితను అదే గ్రామానికి చెందిన సర్వేశ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే తన భార్యను, తనను అత్తమామలు సరిగా పట్టించుకోవడంలేదని.. అత్తమామలు తమ ఒక్కగానొక్క కొడుకు హేమచంద్రని చూసుకుంటున్నారని సర్వేష్ కక్ష పెంచుకున్నాడు. అలాగే ఆస్తి అంతా ఏ రోజుకైనా బావమరిది హేమచంద్రకే వెళుతుందని.. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని సర్వేష్ పథకం వేశాడు. ఆస్తి మీద కన్నేసిన సర్వేశ్.. బావమరిది హేమచంద్రను (5) హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

రోజూ మాదిరి స్కూల్ బస్సు దిగి ఇంటికి వెళుతున్న హేమచంద్రను.. ముఖానికి మాస్క్ కట్టుకున్న సర్వేశ్ కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న సమయంలో ఓ దుకాణం వద్ద ఆగి.. కురుకురే ప్యాకెట్లు కొనుక్కొని వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. సాయంత్రం అయినా బాలుడు హేమచంద్ర ఇంటికి రాకపోవడంతో.. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు దుకాణం వద్ద సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించి.. కిడ్నాప్ చేసింది సర్వేశ్ అని గుర్తించారు. బాలుడు కనిపించడం లేదని అప్పటివరకు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులందరూ వెతుకుతుంటే… సర్వేశ్ కూడా వెతుకుతున్నట్లు నటించాడు.

అయితే పోలీసులు ఎప్పుడైతే సర్వేషే నిందితుడు అని తెలుసుకొని… అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్ లో విచారించడంతో.. సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తికోసం.. అత్తమామల మీద కోపంతో.. అభం శుభం తెలియని బాలుడు హేమచంద్రను… బావ సర్వేష్ అతి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. బాలుడు హేమచంద్రను కిడ్నాప్ చేసి.. కుందనకోట అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి మెడకు తాడు బిగించి… ఊపిరాడకుండా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కొండ ప్రాంతంలోని రాళ్ల మధ్యలో పడేసాడు.

నిందితుడు చెప్పిన వివరాలతో కుందనకోట అటవీ ప్రాంతంలో బాలుడు హేమచంద్ర డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. తనను.. తన భార్యను అత్తమామలు సరిగా పట్టించుకోవడం లేదు అన్న కోపంతోనే బావమరిది హేమచంద్రను హత్య చేసినట్లు సర్వేష్ విచారణలో ఒప్పుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. బాలుడిని హత్య చేసిన సర్వేశ్ ను వదిలిపెట్టొద్దని.. కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు, బంధువులు కోరుతున్నారు.

Follow Us