NHRC: తూర్పు గోదావరి జిల్లా కల్తీపాల ఘటనను సుమోటోగా స్వీకరించిన NHRC, నోటీసులు జారీ!
తూర్పు గోదావరి జిల్లాలో కల్తీ పాల వల్ల 16 మంది మరణించిన ఘటనపై NHRC సుమోటాగా విచారణకు స్వీకరించింది. పాలలో ఇథిలీన్ గ్లైకాల్ వంటి విష పదార్థం ఉన్నట్లు అనుమానాలున్నాయనే ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశాల జారీ చేసింది. బాధితుల ఆరోగ్య పరిస్థితి, దర్యాప్తు పురోగతి, మృతుల కుటుంబాలకు అందించిన పరిహారం వివరాలను నివేదికలో పొందుపరచాలని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఫిబ్రవరి మధ్య నుండి కల్తీ పాలు సేవించడం వల్ల 16 మంది మరణించినట్లు వచ్చిన వార్తలపై NHRC స్వచ్ఛందంగా విచారణకు స్వీకరించింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది.. కల్తీ పాల వల్ల సంభవించిన మరణాలపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని కోరింది. నివేదికలో బాధితుల ఆరోగ్య పరిస్థితి, దర్యాప్తు పురోగతి, అలాగే మృతుల కుటుంబ సభ్యులకు ఏదైనా పరిహారం చెల్లించి ఉంటే ఆ వివరాలు కూడా పొందుపరచాలని NHRC ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలోని లాలాచెరువు, చౌడేశ్వరనగర్ స్వరూప్‌నగర్ ప్రాంతాల్లో, ఫిబ్రవరి మధ్య నుండి కల్తీ పాలు సేవించడం వల్ల 16 మంది మరణించినట్లు వచ్చిన మీడియా నివేదికను భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ స్వచ్ఛందంగా విచారణకు స్వీకరించింది. ఇదే విధమైన లక్షణాలతో కనీసం నలుగురు వ్యక్తులు వైద్య చికిత్స పొందుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. పాలలో ఇథిలీన్ గ్లైకాల్ అనే విష పదార్థం కలిసినట్లు, దీనివల్ల బాధితుల్లో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ సంభవించినట్లు సమాచారం. ఈ కల్తీకి మూలంగా భావిస్తున్న ప్రదేశాన్ని నర్సాపురం గ్రామంలోని ఒక డెయిరీగా గుర్తించినట్టు తెలుస్తోంది.
ఈ డెయిరీ ఆ ప్రాంతంలోని 100కి పైగా కుటుంబాలకు పాలను సరఫరా చేస్తోందని.. ఫిబ్రవరిలో స్థానికులు కడుపు నొప్పి, వాంతులు, మూత్రం రాకపోవడం, తీవ్రమైన మూత్రపిండాల వైఫల్యం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనడంతో కల్తీ పాల క్యూబ్ వెలుగులోకి వచ్చిందని కథనాలు వచ్చాయి. బాధితుల్లో ఎక్కువ మంది వృద్ధులు లేదా చిన్న పిల్లలు ఉన్నారని.. కల్తీ పాల వల్ల మరణాలు సంభవించినట్లు వచ్చిన వార్తా నివేదికలోని అంశాలు నిజమే అయితే, అవి బాధితుల మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన తీవ్రమైన సమస్యలను లేవనెత్తుతున్నాయని కమిషన్ అభిప్రాయపడింది.
అందువల్ల, రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి , డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు నోటీసులు జారీ చేస్తూ, ఈ విషయంపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. నివేదికలో బాధితుల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, దర్యాప్తు పురోగతి, అలాగే మృతుల కుటుంబ సభ్యులకు ఏదైనా పరిహారం చెల్లించి ఉంటే ఆ వివరాలు కూడా పొందుపరచాల్సి ఉంటుందని కమిషన్ పేర్కొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
