AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాహనదారులకు గుడ్‌న్యూస్.. హైవేలపై క్యూఆర్ కోడ్స్‌.. ఒక్క స్కాన్‌తో వివరాలన్న మీ చేతిలోనే!

హైవేలపై ప్రయాణించే వాహనదారులకు ఎన్‌హెచ్ఏఐ అదిరిపోయే శుభవార్త చెప్పింది. హైవేపై పెట్రోల్ బంకులు, హోటల్‌లు, ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు వీలుగా రహదారిపై ప్రత్యేక క్యూఆర్ స్కాన్ బోర్డులను ఏర్పాటు చేయనుంది. జస్ట్ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలూ అన్ని వివరాలు తెలిసేలా ఏర్పాట్లు చేసింది. కొత్తగా జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

వాహనదారులకు గుడ్‌న్యూస్.. హైవేలపై క్యూఆర్ కోడ్స్‌.. ఒక్క స్కాన్‌తో  వివరాలన్న మీ చేతిలోనే!
Nhai Qr Code For Highways
Anand T
|

Updated on: Apr 20, 2026 | 9:51 AM

Share

ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు ఎన్‌హెచ్ఏఐ ఎప్పికప్పుడూ సరికొత్త విధానాలను తీసుకొస్తుంది. తాజాగా జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారుల కోసం క్యూఆర్ కోడ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. హైవేపై మైలు రాళ్లు, టోల్ ప్లాజాల వద్ద క్యూఆర్ కోడ్ బోర్డులను ఏర్పాటు చేస్తోంది. జస్ట్ వీటిని స్కాన్ చేస్తే చాలూ మనం ఎంత టోల్ కట్టాలి, మనకు దగ్గర్లో పెట్రోల్ బంకులు, హోటళ్లు ఏమున్నాయి. అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు ఇలా పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఎదురువుతున్న గూగుల్ మ్యాప్స్ సమస్యలకు చెక్‌ పెట్టేందుకే NHAI ఈ కొద్ద క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చింది.

సాధారణంగా మనకు దగ్గర్లో ఏవైనా పెట్రోల్ బంకులు లేదా రెస్టారెంట్ వంటి ఎమర్జెన్సీ సేవల గురించి తెలుసుకోవాలంటే మనం గూగుల్ మ్యాప్స్‌ లేదా ఎవరినైనా అడిగి తెలుసుకుంటాం. కానీ మనకు ఇవేవి అందుబాటులో లేకుంటాయి. లేదా గూగుల్‌ మ్యాప్స్ ఖచ్చితమైన సమాచారం ఇవ్వకపోవచ్చు. అలాంటి సమయాల్లో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఈ క్యూఆర్ కోడ్ స్కానర్స్‌ సమాచారాన్ని అందిస్తాయి. ఇది ప్రయాణికుల సమయాన్ని సైతం ఆదా చేస్తోంది. ప్రస్తుతం ఖమ్మం-దేవరపల్లి హైవేపై మీరు ఈ స్కాన్ బోర్డులను చూడవచ్చు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని మరికొన్ని హైవేలనూ కూడా వీటిని ఏర్పాటు చేసేందుకు అధికారులు ట్రై చేస్తున్నారు.

స్కాన్‌తో లభించే సేవలు ఇవే..

  • టోల్ వివరాలు: మీరు ప్రయాణిస్తున్న రూట్‌లో ఎన్ని టోల్‌ గేట్స్ ఉన్నాయి. అక్కడ ఎంత టోల్ కట్టాలి, టోల్ మేనేజర్ల సంప్రదింపు నంబర్లు తెలుసుకోవచ్చు.
  • వాహన అవసరాలు: మార్గమధ్యలో ఉండే పెట్రోల్ బంకులు, టైర్ పంక్చర్ షాపులు, ఈవీ (EV) ఛార్జింగ్ పాయింట్ల లొకేషన్లను సులభంగా గుర్తించవచ్చు.
  • ఫుడ్‌ అండ్ స్టే: మీరు ప్రయాణించే హైవే వెంట ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జింగ్ వివరాలు ఇందులో అందుబాటులో ఉంటాయి.
  • ఎమర్జెన్సీ సేవలు: ప్రమాదాలు జరిగినప్పుడు లేదా వాహనం పాడైనప్పుడు వెంటనే సాయం పొందేలా హైవే హెల్ప్‌లైన్, అంబులెన్స్, సమీప ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్ల ఫోన్ నంబర్లు కూడా ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెండిపై ఎంతంటే
మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెండిపై ఎంతంటే
హైవేలపై ప్రయాణించే వారికి గుడ్‌న్యూస్.. ఇక ఒక్క స్కాన్‌తో
హైవేలపై ప్రయాణించే వారికి గుడ్‌న్యూస్.. ఇక ఒక్క స్కాన్‌తో
టెన్త్ అర్హతతో నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
టెన్త్ అర్హతతో నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
నెల రోజులు వచ్చే గ్యాస్ సిలిండర్ 45 రోజులు రావాలా? సింపుల్ టిప్స్
నెల రోజులు వచ్చే గ్యాస్ సిలిండర్ 45 రోజులు రావాలా? సింపుల్ టిప్స్
వాకింగ్ లేదా రన్నింగ్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
వాకింగ్ లేదా రన్నింగ్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
మరికొన్ని గంటల్లో ముగుస్తు Polycet 2026 దరఖాస్తు గడువు.. లింక్
మరికొన్ని గంటల్లో ముగుస్తు Polycet 2026 దరఖాస్తు గడువు.. లింక్
మ్యూజిక్ లవర్స్‌కి జాతీయ గీతం లాంటి పాట ఇది...
మ్యూజిక్ లవర్స్‌కి జాతీయ గీతం లాంటి పాట ఇది...
రూ.5 లక్షల్లో సూపర్‌ బిజినెస్‌.. తలరాత మారిపోవాల్సిందే!
రూ.5 లక్షల్లో సూపర్‌ బిజినెస్‌.. తలరాత మారిపోవాల్సిందే!
రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్..మరికొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు
రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్..మరికొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు
అదృష్టం అంటే వీళ్లదే..1 లక్షను రూ.1.75 కోట్లు చేసిన మల్టీబ్యాగర్
అదృష్టం అంటే వీళ్లదే..1 లక్షను రూ.1.75 కోట్లు చేసిన మల్టీబ్యాగర్