AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీరియల్ యాక్టర్‌గా మారిన హీరో ఆకాష్..

హీరో ఆకాష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. 'ఆనందం' వంటి మంచి బ్లాక్ బస్టర్ హిట్‌ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న ఆకాష్.. తరువాత తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేశారు. కానీ హీరోగా అతనికి మంచి విజయాలు దక్కలేదు. దీంతో తనను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన తమిళ ఇండస్ట్రీ వైపు..

సీరియల్ యాక్టర్‌గా మారిన హీరో ఆకాష్..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 01, 2020 | 7:27 PM

Share

హీరో ఆకాష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ‘ఆనందం’ వంటి మంచి బ్లాక్ బస్టర్ హిట్‌ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న ఆకాష్.. తరువాత తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేశారు. కానీ హీరోగా అతనికి మంచి విజయాలు దక్కలేదు. దీంతో తనను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన తమిళ ఇండస్ట్రీ వైపు వెళ్లారు. కానీ అక్కడ కూడా హీరోగా సక్సెస్ కాలేకపోయారు. అనంతరం ఆకాష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు. సునీల్ హీరోగా 2006లో వచ్చిన ‘అందాల రాముడు’ సినిమాతో టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు ఆకాష్. ఈ చిత్రం తర్వాత నవ వసంతం, గోరింటాకు, నమో వెంకటేశ వంటి సినిమాల్లో నటించారు.

ఆ తర్వాత కొద్ది రోజులు బ్రేక్ తీసుకున్న ఆకాష్.. ఇప్పుడు సీరియల్ యాక్టర్‌గా మారారు. కన్నడలో ఆకాష్ నటించిన ‘జోతాయి.. జోతాయల్లీ’ సీరియల్ అక్కడి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. ఇదే సీరియల్‌‌ని తమిళంలో కూడా ‘నీతానై ఎంతన్ పొన్వసంతన్’ పేరుతో ప్రసారం అవుతుంది. ఇక ఇప్పుడు ఈ సీరియల్‌నే తెలుగులో ‘ప్రేమ ఎంత మధురం’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. కాగా మరోవైపు ఆకాష్ 5 సినిమాల్లో నటిస్తున్నారు. అలాగే ‘ఏ క్యూబ్’ పేరుతో మూవీ యాప్‌ను సిద్ధం చేశారు ఆకాష్. ఈ యాప్ ద్వారా తెలుగు ప్రేక్షకులను కూడా మరోమారు అలరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

Read More: 

ఆల్‌టైమ్ హై రికార్డుకు చేరుకున్న బంగారం.. లేటెస్ట్ ధర రూ.50,950

పోలీసులకు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఫిర్యాదు..

బ్రేకింగ్: సీరియల్ నటి నవ్యా‌ స్వామికి కరోనా పాజిటివ్..

Follow Us
శక్తికి, ఆరోగ్యానికి బెస్ట్ ఫుడ్ నల్ల కూర.. ఆ ఒక్క తప్పు చేయొద్దు
శక్తికి, ఆరోగ్యానికి బెస్ట్ ఫుడ్ నల్ల కూర.. ఆ ఒక్క తప్పు చేయొద్దు
చిరుతపులి vs కొండ గొర్రె.. ఇలాంటి వేట అస్సలు చూసిండరు
చిరుతపులి vs కొండ గొర్రె.. ఇలాంటి వేట అస్సలు చూసిండరు
బాడీకి చలువ చేసే ఈ కూరను పిల్లల లంచ్ బాక్స్ లో పెడితే హెల్తీగా..
బాడీకి చలువ చేసే ఈ కూరను పిల్లల లంచ్ బాక్స్ లో పెడితే హెల్తీగా..
వెన్నెలా కరిగిపోయే సాఫ్ట్ మైసూర్ పాక్.. ఎలా తయారు చేయాలంటే?
వెన్నెలా కరిగిపోయే సాఫ్ట్ మైసూర్ పాక్.. ఎలా తయారు చేయాలంటే?
ఆ రాశుల వారికి కెరీర్, ఆర్థిక విషయాల్లో కీలక మార్పులు
ఆ రాశుల వారికి కెరీర్, ఆర్థిక విషయాల్లో కీలక మార్పులు
మూడు గ్రహాల కలయిక.. వీరికి అదృష్టమే అదృష్టం..
మూడు గ్రహాల కలయిక.. వీరికి అదృష్టమే అదృష్టం..
అప్పులు తీర్చే ఆలయం..ఇక్కడికి వెళితే, కోట్లు అప్పైనా తీరిపోద్దీ
అప్పులు తీర్చే ఆలయం..ఇక్కడికి వెళితే, కోట్లు అప్పైనా తీరిపోద్దీ
కళ్లకు కనికట్టు.. అది ప్రకృతి చేసిన మాయ!
కళ్లకు కనికట్టు.. అది ప్రకృతి చేసిన మాయ!
సింహంతో గేమ్సా.. మత్తులో ఉందని తరలిస్తుండగా ఊహించని ట్విస్ట్..
సింహంతో గేమ్సా.. మత్తులో ఉందని తరలిస్తుండగా ఊహించని ట్విస్ట్..
భారీగా తగ్గనున్న బంగారం ధరలు.. వైరల్ అవుతున్న బాబా వంగా జ్యోస్యం
భారీగా తగ్గనున్న బంగారం ధరలు.. వైరల్ అవుతున్న బాబా వంగా జ్యోస్యం