పుల్వామా దాడిని ప్రశంసిస్తూ ట్వీట్‌ చేసిన ఏఎంయూ స్టుడెంట్

ఉత్తరప్రదేశ్ : పుల్వామాలో ఉగ్రవాదుల దాడిని ఓవైపు ప్రపంచమంతా ఖండిస్తుంటే… కొందరు మాత్రం సామాజిక మాధ్యమాల్లో తమ పైశాచికత్వాన్ని చూపిస్తూ దేశద్రోహానికి పాల్పడుతున్నారు. అలీఘఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయానికి చెందిన బాసిమ్ హిలాల్ అనే విద్యార్ధి పుల్వామా ఉగ్రదాడిని ప్రశంసిస్తూ ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల సంచలనం సృష్టించిన ” యూరి ” సినిమాలో హౌ ఈజ్‌ జోష్‌? గ్రేట్‌ సర్‌ అనే డైలాగ్‌ ప్రాచుర్యం పొందింది. అయితే జైష్‌-ఎ-మహమ్మద్‌ ఉగ్రదాడి జరిగిన తర్వాత హౌ ఈజ్‌ […]

పుల్వామా దాడిని  ప్రశంసిస్తూ ట్వీట్‌ చేసిన ఏఎంయూ స్టుడెంట్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 2:11 PM

ఉత్తరప్రదేశ్ : పుల్వామాలో ఉగ్రవాదుల దాడిని ఓవైపు ప్రపంచమంతా ఖండిస్తుంటే… కొందరు మాత్రం సామాజిక మాధ్యమాల్లో తమ పైశాచికత్వాన్ని చూపిస్తూ దేశద్రోహానికి పాల్పడుతున్నారు. అలీఘఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయానికి చెందిన బాసిమ్ హిలాల్ అనే విద్యార్ధి పుల్వామా ఉగ్రదాడిని ప్రశంసిస్తూ ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల సంచలనం సృష్టించిన ” యూరి ” సినిమాలో హౌ ఈజ్‌ జోష్‌? గ్రేట్‌ సర్‌ అనే డైలాగ్‌ ప్రాచుర్యం పొందింది. అయితే జైష్‌-ఎ-మహమ్మద్‌ ఉగ్రదాడి జరిగిన తర్వాత హౌ ఈజ్‌ జోష్‌? గ్రేట్‌ సర్‌ అంటూ హిలాల్‌ ట్విట్టర్‌లో వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశాడు. దీంతో పోలీసులు వెంటనే అతనిపై ఐపీసీ సెక్షన్ 153A మరియు ఐటీ సెక్షన్ 67A కింద కేసులు నమోదు చేశారు. కాగా యూనివర్సిటీ కూడా బాసిమ్ హిలాల్ ను సస్పెండ్ చేసింది.