నవజ్యోత్ సింగ్ సిద్ధూపై నెటిజన్ల దాడి
పుల్వామా ఉగ్రదాడిపై స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుల్వామా దాడి గురించి సిద్ధూ స్పందిస్తూ `ఉగ్రవాదానికి జాతి, మతం ఉండదు. కొంత మంది కోసం దేశం మొత్తాన్ని నిందిస్తారా! ఈ హింసకు పాల్పడిన వారిని శిక్షించాల్సిందే. అయితే ఈ పేరుతో ఒక దేశం మొత్తాన్ని నిందించకూడదు. అన్ని దేశాల్లోనూ చెడ్డవారు, మంచివారు ఉంటారు` అని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమార౦ చెలరేగుతో౦ది. […]
పుల్వామా ఉగ్రదాడిపై స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుల్వామా దాడి గురించి సిద్ధూ స్పందిస్తూ `ఉగ్రవాదానికి జాతి, మతం ఉండదు. కొంత మంది కోసం దేశం మొత్తాన్ని నిందిస్తారా! ఈ హింసకు పాల్పడిన వారిని శిక్షించాల్సిందే. అయితే ఈ పేరుతో ఒక దేశం మొత్తాన్ని నిందించకూడదు. అన్ని దేశాల్లోనూ చెడ్డవారు, మంచివారు ఉంటారు` అని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమార౦ చెలరేగుతో౦ది.
సిద్ధూ పాల్గొంటున్న `ది కపిల్ శర్మ` షోను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు నెటిజన్లు. `ది కపిల్ శర్మ` షోను బహిష్కరించండి, సిద్ధును బహిష్కరించండి, సోనీటీవీని బహిష్కరించండి అంటూ ట్విట్టర్ వేదికగా రెచ్చిపోతున్నారు. `ది కపిల్ శర్మ షోను చూడకపోవడమే అమర జవాన్లకు అర్పించే నిజమైన నివాళి`, `దేశ సైనికులు 43 మంది ప్రాణాలు కోల్పోతే.. సిగ్గు లేకుండా పాకిస్తాన్‌కు వత్తాసు పలుకుతావా` అంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా సిద్ధూపై ఇదే తరహాలో విమర్శలు వ్యక్తమయ్యాయి.