సహకరిస్తున్నా…వేధిస్తున్నారు: రాబర్ట్‌ వాద్రా

దిల్లీ: విచారణకు సహకరిస్తున్నప్పటికీ ఈడీ అధికారులు ఆస్తులను జప్తు చేస్తూ తన వెంట పడి వేధిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ నేత, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రా ఆరోపించారు. ఈడీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. బికనీర్‌లోని తన ఆస్తులను జప్తు చేయడంపై వాద్రా ఫేస్‌బుక్‌ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేనేమి దాచడం లేదు. విచారణకు హాజరువుతూ సహకరిస్తున్నాను. రోజుకి 8 నుంచి 12 గంటల పాటు నన్ను విచారించారు. 40 నిమిషాల పాటు లంచ్‌కు […]

  • Updated On - 8:04 pm, Thu, 7 March 19 Edited By: Srinu Perla
సహకరిస్తున్నా...వేధిస్తున్నారు: రాబర్ట్‌ వాద్రా

దిల్లీ: విచారణకు సహకరిస్తున్నప్పటికీ ఈడీ అధికారులు ఆస్తులను జప్తు చేస్తూ తన వెంట పడి వేధిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ నేత, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రా ఆరోపించారు. ఈడీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. బికనీర్‌లోని తన ఆస్తులను జప్తు చేయడంపై వాద్రా ఫేస్‌బుక్‌ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘నేనేమి దాచడం లేదు. విచారణకు హాజరువుతూ సహకరిస్తున్నాను. రోజుకి 8 నుంచి 12 గంటల పాటు నన్ను విచారించారు. 40 నిమిషాల పాటు లంచ్‌కు విరామం ఇచ్చారు. నేను వాష్‌రూంకి వెళ్లేప్పుడు కూడా నా వెంట ఎస్కార్ట్‌ పంపించారు. ఎక్కడికి విచారణకు రమ్మని చెప్పినా వెళ్తూ పూర్తిగా సహకరిస్తున్నా. కానీ నా కార్యాలయాన్ని జప్తు చేశారు. కావాలని నా వెంట పడి నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు. న్యాయం కోసం ఎదురుచూస్తాను’ అని వాద్రా పోస్టు చేశారు. బికనీర్‌ భూ కుంభకోణం నగదు అక్రమ చలామణి కేసులో వాద్రా కంపెనీకి చెందిన రూ.4.62కోట్ల విలువైన ఆస్తులను ఈడీ శుక్రవారం జప్తు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి వాద్రా గత వారం మూడు రోజుల పాటు ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.