Elephant: అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా.. గ్రామంలో ప్రవేశించిన ఏనుగు.. భయంతో వణికిపోయిన జనం
అడవుల్లో ఉండాల్సిన వన్యప్రాణులు గ్రామాలు, జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. పట్టణాలు, నగరాలు, పంటపొలాలు, గ్రామాలు అనే తేడా లేకుండా బీభత్సం సృష్టిస్తున్నాయి. అడవులను నరికివేయడం, ఆహారం దొరకకపోవడం వంటి కారణాలతో గ్రామాల్లోకి..
అడవుల్లో ఉండాల్సిన వన్యప్రాణులు గ్రామాలు, జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. పట్టణాలు, నగరాలు, పంటపొలాలు, గ్రామాలు అనే తేడా లేకుండా బీభత్సం సృష్టిస్తున్నాయి. అడవులను నరికివేయడం, ఆహారం దొరకకపోవడం వంటి కారణాలతో గ్రామాల్లోకి ప్రవేశిస్తాయి. తాజాగా తమిళనాడులో (Tamil Nadu) ని ఈరోడ్ జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది. అర్థరాత్రి జనావాసాల్లోకి చేరిన గజరాజు స్థానికులను ముప్పుతిప్పలు పెట్టించింది. బాగుర్ అటవీ ప్రాంతాలలో ఉన్న గ్రామాలలోకి ఏనుగు ప్రవేశించింది. గ్రామాలలో ఉన్న ఇళ్లపై దాడి చేయడంతో జనం భయంతో పరుగులు తీశారు. అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు గ్రామం నుంచి ఏనుగుని తరలించేందుకు శ్రమిస్తున్నారు. ఏనుగును అటవీ ప్రాంతంలోకి తరిమికొట్టేందుకు గ్రామస్థులు, అటవీశాఖ సిబ్బంది బాణాసంచా కాల్చారు.
మరోవైపు.. అడవుల నుంచి జనావాసాల్లోకి ఏనుగులు వస్తున్న ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. ఈరోడ్ ప్రాంతమే కాకుండా సరిహద్దులో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోనూ గజరాజులు వస్తున్నాయి. అడవుల నుంచి దారితప్పి సమీప గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఇలా ఏనుగు గానీ మంద గానీ గ్రామంలోకి వచ్చిందంటే ఊరు ఊరంతా భయాందోళనకు గురవుతున్నారు. వందల ఎకరాల పంటను క్షణాల్లో ధ్వంసం చేస్తున్నాయి.
గతంలోనూ ఈరోడ్ జిల్లాలోని సత్యమంగళ పట్టణ శివార్లలో ఇటీవల సమీప అడవుల్లోంచి దారితప్పి వచ్చిన ఓ ఏనుగుల గుంపు అరటి తోటపై దాడి చేసింది. తోటలోని 300కు పైగా అరటిచెట్లను తొక్కి విధ్వంసం సృష్టించాయి. అయితే మరోసారి ఏనుగు జనావాసాల్లోకి రావడంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వన్యప్రాణుల నుంచి కాపాడాలని కోరుతున్నారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి