Coronavirus Cases: దేశంలో పెరిగిన కోవిడ్ కేసులు, యుధ్ధ ప్రాతిపదికన జన్యు సంబంధ శాంపిల్స్ పై పరీక్షలు

దేశంలో ఒక్కసారిగా ముఖ్యంగా 5 రాష్ట్రాల్లో పెరిగిన కోవిడ్ కేసులతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వైరస్ కు సంబంధించి మ్యుటెంట్ స్ట్రెయిన్స్ విజృంభిస్తున్నాయా..

Coronavirus Cases: దేశంలో పెరిగిన కోవిడ్ కేసులు, యుధ్ధ ప్రాతిపదికన జన్యు సంబంధ శాంపిల్స్ పై పరీక్షలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 23, 2021 | 4:06 PM

దేశంలో ఒక్కసారిగా ముఖ్యంగా 5 రాష్ట్రాల్లో పెరిగిన కోవిడ్ కేసులతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వైరస్ కు సంబంధించి మ్యుటెంట్ స్ట్రెయిన్స్ విజృంభిస్తున్నాయా..అన్న భయాందోళన నేపథ్యంలో మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి 800 నుంచి 900 శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కి పంపారు. ఇందుకు ప్రత్యేక ల్యాబ్ లను ఏర్పాటు చేశారు. పంజాబ్, బెంగుళూరు నగరాల నుంచి కూడా ఈ విధమైన శాంపిల్స్ ను పంపాలని కోరినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే దేశంలో 6 వేల జీనోమ్ సీక్వెన్సింగ్ శాంపిల్స్ ని పరీక్షించినట్టు ఈ శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ మళ్ళీ ప్రబలడానికి కొత్త మ్యుటెంట్ స్ట్రెయిన్లు కారణమా అన్నవిషయాన్ని విశ్లేషించనున్నారు. మరో నాలుగైదు రోజుల్లో ఈ అంశం స్పష్టమవుతుందని ఈ శాఖ పేర్కొంది. జీనోమ్ సీక్వెన్సింగ్ అంటే జన్యు సంబంధ కణజాలాన్ని మరింత లోతుగా స్టడీ చేయడం..ఇందుకు గాను దేశంలో పది సర్వేలెన్స్ సైట్స్ లేదా ల్యాబ్స్ ని ఏర్పాటు చేశారు.

ఇతర దేశాల నుంచి ఇండియాలో ప్రవేశించిన మ్యుటెంట్లు ఇందుకు కారణమా లేక దేశంలోనే కొత్త మ్యుటెంట్ స్ట్రెయిన్స్ తలెత్తాయా అన్నదాన్ని కూడా నిర్ధారించనున్నారు. ఐసీఎంఆర్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ హెడ్ డాక్టర్ ఎన్.కె. అరోరా ఈ విషయమై మాట్లాడుతూ.. యూరప్ మాదిరి కాక… వేగంగా వ్యాప్తి చెందే యూకే వేరియంట్ వంటిదాని జాడ  ఇండియాలో కనబడడంలేదని అన్నారు. మన దేశంలో ఇప్పటివరకు 187 యూకే వేరియంట్ కేసులు బయటపడ్డాయన్నారు.

ఇలా ఉండగా మహారాష్ట్ర, కేరళ, గోవా, ఏపీ, చండీ గఢ్ రాష్ట్రాలకు కేంద్రం ఓ యాక్షన్ ప్లాన్ పంపింది. టెస్టింగుల ద్వారా మ్యుటెంట్ స్ట్రెయిన్లను మానిటరింగ్ చేయాలని, అలాగే జీనోమ్ సీక్వెన్సింగ్ తప్పనిసరి అని పేర్కొంది.

Also Read:

Corona Cases India: దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 14,199 పాజిటివ్ కేసులు, 83 మరణాలు..

Corona Virus: స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లు జాగ్రత్త.. కరోనా ఎక్కువ కాలం బతికుండేది మొబైల్‌ స్క్రీన్‌ పైనే అని తెలుసా..?