వాట్సాప్… ఈ-మెయిల్ ద్వారా పరీక్షలా ? హవ్వ !

పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనల నేపథ్యంలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్ యు)విద్యార్థులు సెమిస్టర్ పరీక్షలను బహిష్కరించాలని నిర్ణయించడంతో యూనివర్సిటీ అధికారులు అసాధారణంగా ఈ పరీక్షలను నిర్వహించాలని యోచిస్తున్నారు. వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా వీటిని నిర్వహించేందుకు యోచిస్తున్నారు. ఈ మేరకు సెంటర్ చైర్ పర్సన్స్ అందరికీ లేఖలు రాసినట్టు స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ డీన్ అశ్విని మహాపాత్ర తెలిపారు. అసాధారణ పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణకు తమకు ఇదే సరైన మార్గమని తోచిందని ఆయన చెప్పారు. ఈ […]

వాట్సాప్... ఈ-మెయిల్ ద్వారా పరీక్షలా ? హవ్వ !
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Dec 18, 2019 | 5:22 PM

పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనల నేపథ్యంలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్ యు)విద్యార్థులు సెమిస్టర్ పరీక్షలను బహిష్కరించాలని నిర్ణయించడంతో యూనివర్సిటీ అధికారులు అసాధారణంగా ఈ పరీక్షలను నిర్వహించాలని యోచిస్తున్నారు. వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా వీటిని నిర్వహించేందుకు యోచిస్తున్నారు. ఈ మేరకు సెంటర్ చైర్ పర్సన్స్ అందరికీ లేఖలు రాసినట్టు స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ డీన్ అశ్విని మహాపాత్ర తెలిపారు. అసాధారణ పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణకు తమకు ఇదే సరైన మార్గమని తోచిందని ఆయన చెప్పారు. ఈ నెల 16 న సెంటర్ చైర్ పర్సన్స్ సమావేశంలో ఈ విషయమై ఏకాభిప్రాయం కుదిరిందని తెలిపారు. ఎంఫిల్, పీహెచ్ డీ, ఎంఏ ప్రోగ్రామ్ విద్యార్థులకు సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహించడానికి ప్రత్యామ్నాయ విధానం ఇదేనని మహాపాత్ర అభిప్రాయపడ్డారు. విద్యార్థులు తమ సమాధాన పత్రాలను ఈ-మెయిల్ లేదా చేతిరాత స్క్రిప్ట్ ఇమేజీలతో వాట్సాప్ ద్వారా పంపవచ్చునని, లేక కోర్సు టీచర్లకు వ్యక్తిగతంగా అందజేయవచ్ఛుని పేర్కొన్నారు. అయితే ఈ పధ్ధతి అధ్వాన్నంగా, హాస్యాస్పదంగా ఉందని జె ఎన్ యు టీచర్స్ అసోసియేషన్, విద్యార్ధి సంఘాలు తప్పు పట్టాయి. యూనివర్సిటీ అధికారులు తప్పుడు ఆలోచనలతో విద్యార్థుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని వారు ఆరోపించారు.