AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking:ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్ర నిలిపివేత

. ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్రను రద్దు చేస్తున్నట్లు అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు ప్రకటించింది. దేశంలో కరోనా వైరస్‌ విస్తరిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ జీసీ మర్ము అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Breaking:ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్ర నిలిపివేత
Balaraju Goud
|

Updated on: Jul 21, 2020 | 8:24 PM

Share

కరోనా మహమ్మారి ప్రభావం దేవాలయాలపై కూడా పడుతోంది. ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్రను రద్దు చేస్తున్నట్లు అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు ప్రకటించింది. దేశంలో కరోనా వైరస్‌ విస్తరిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ జీసీ మర్ము అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అమర్‌నాథ్‌ యాత్ర అంత శ్రేయస్కరం కాదని సమావేశం నిర్ణయించింది. అందుకే ఈ ఏడాది యాత్రను రద్దు చేస్తున్నామని సమావేశం అనంతరం అమర్‌నాథ్‌ బోర్డు ప్రకటించింది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఉదయం, సాయంత్రం వర్చువల్‌ దర్శన సదుపాయాన్ని మాత్రం యథావిధిగా కొనసాగిస్తామని వెల్లడించింది. పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తూ ఈ యాత్ర కొనసాగించాలని భావించారు అయితే, కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గతేడాది ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో అమర్‌నాథ్‌ యాత్ర సగంలోనే నిలిచిపోయింది. దీంతో రెండు సంవత్సరాలుగా అమరనాథుడి దర్శనాన్ని భక్తులు నోచుకోలేకపోయారు,

Follow Us
ఈసారి చూడబోయేది దశావతారమే.. బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వైరల్.
ఈసారి చూడబోయేది దశావతారమే.. బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వైరల్.
ఇప్పుడు తెలుగులో ఈ నటుడి పేరు మార్మోగుతుంది..ఎవరో గుర్తు పట్టారా?
ఇప్పుడు తెలుగులో ఈ నటుడి పేరు మార్మోగుతుంది..ఎవరో గుర్తు పట్టారా?
ఫిష్ అక్వేరియం ఈ దిశలో ఉంటే.. చేతి నిండా సంపద!
ఫిష్ అక్వేరియం ఈ దిశలో ఉంటే.. చేతి నిండా సంపద!
ఇదేందయ్యా ఇది.. ఈ బొద్దింక ధర రూ. 1.34 కోట్లా..
ఇదేందయ్యా ఇది.. ఈ బొద్దింక ధర రూ. 1.34 కోట్లా..
నిమ్స్ డాక్టర్ల అద్భుతం.. తలపై చిన్న మచ్చ లేకుండా బ్రెయిన్..
నిమ్స్ డాక్టర్ల అద్భుతం.. తలపై చిన్న మచ్చ లేకుండా బ్రెయిన్..
కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తోందా..?
కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తోందా..?
పల్లెటూర్లలో చెట్ల కింద కూర్చొని పేదోళ్ళ పొలం పచ్చడి తింటే అమృతమే
పల్లెటూర్లలో చెట్ల కింద కూర్చొని పేదోళ్ళ పొలం పచ్చడి తింటే అమృతమే
సింహంపై సవారీ.. భారత్‌లో బైక్ రైడింగ్..ట్రంప్ వీడియో చూశారంటే..
సింహంపై సవారీ.. భారత్‌లో బైక్ రైడింగ్..ట్రంప్ వీడియో చూశారంటే..
మృగశిర కార్తెకు ముందే పండగ.. చెరువులోని చేపల లూటీ..
మృగశిర కార్తెకు ముందే పండగ.. చెరువులోని చేపల లూటీ..
3 బాయిల్డ్ ఎగ్స్ రూ. 500లు, పరాటా రూ. 1100లు.. ఈ బిల్ చూస్తే షాకే
3 బాయిల్డ్ ఎగ్స్ రూ. 500లు, పరాటా రూ. 1100లు.. ఈ బిల్ చూస్తే షాకే