AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో మొదలైన కోడి పందాల జోరు.. బెట్టింగుల హోరు.!

సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు కోళ్ల పందాల జోరు మొదలవుతుంది. ముఖ్యంగా గోదావరి ప్రాంతాల్లోని ప్రజలు వీటిని ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. ఒక బరిలో రెండు కోడి పుంజులు ఢీ అంటే ఢీ అంటూ తలబడుతుంటే.. వచ్చే మజానే వేరుగా ఉంటుంది. ఇక ఈ పందాలకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. పందెంరాయుళ్లు సిద్ధంగా ఉండగా.. వందల కోట్లు ఈ మూడు రోజుల్లో అనేక చేతులు మారనున్నాయి. కోడి పందాలు నిర్వహించకూడదని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నా […]

ఏపీలో మొదలైన కోడి పందాల జోరు.. బెట్టింగుల హోరు.!
Ravi Kiran
|

Updated on: Jan 13, 2020 | 1:18 PM

Share

సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు కోళ్ల పందాల జోరు మొదలవుతుంది. ముఖ్యంగా గోదావరి ప్రాంతాల్లోని ప్రజలు వీటిని ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. ఒక బరిలో రెండు కోడి పుంజులు ఢీ అంటే ఢీ అంటూ తలబడుతుంటే.. వచ్చే మజానే వేరుగా ఉంటుంది. ఇక ఈ పందాలకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. పందెంరాయుళ్లు సిద్ధంగా ఉండగా.. వందల కోట్లు ఈ మూడు రోజుల్లో అనేక చేతులు మారనున్నాయి. కోడి పందాలు నిర్వహించకూడదని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నా కూడా.. నిర్వాహకులు మాత్రం ఏమీ పట్టనట్లు రంగం సిద్ధం చేస్తున్నారు.

ఇక ఈ పందాల కోసం ప్రత్యేకంగా పుంజులను రెడీ చేస్తున్నారు. అంతేకాకుండా వాటికి బాదం, జీడిపప్పులు పెట్టి మరీ పెంచుతున్నారు. ఇదిలా ఉండగా ఒక్కో పుంజు రూ.5 వేల నుంచి లక్ష రూపాయల వరకు ధరలు పలుకుతున్నాయి. ఆన్లైన్ లో వీటి ఫోటోలను పెట్టి మరీ విక్రయిస్తుండటం ఆనవాయితీగా మారింది. కాగా, కోళ్ల పందాలకు కేరాఫ్ అడ్రస్ అయిన భీమవరంలో అయితే ఇప్పటికే పొలాల్లో టెంట్లు ఏర్పాటు కాగా.. ఇక పాల్గొంటున్న వారికి కోసం మద్యం, మాంసం రెడీ అవుతున్నాయి. అలాగే  బెట్టింగులు జోరు కూడా పెరుగుతోంది. అయితే ఈసారి అమరావతి రాజధాని మార్పు ఆందోళనతో వెల్లువెత్తుతున్న పట్టణాల్లో ఈ ఉత్సాహం తగ్గినట్లు కనిపిస్తోంది.

Follow Us
పసివాడిపై పిన్నమ్మ దాష్టీకం..చాక్లెట్ తినిపిస్తానని.. నోరు తెరవగా
పసివాడిపై పిన్నమ్మ దాష్టీకం..చాక్లెట్ తినిపిస్తానని.. నోరు తెరవగా
ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల 2026 హాల్‌టికెట్లు విడుదల
ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల 2026 హాల్‌టికెట్లు విడుదల
టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్ కలకలం.. రంగంలోకి ఐసీసీ
టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్ కలకలం.. రంగంలోకి ఐసీసీ
ఇక రైలు ప్రయాణంలో కుదుపులకు చెక్! ప్రయాణం సాఫీగా.. ఆ శబ్దం ఉండదు!
ఇక రైలు ప్రయాణంలో కుదుపులకు చెక్! ప్రయాణం సాఫీగా.. ఆ శబ్దం ఉండదు!
నానమ్మ నేర్పిన ధైర్యం.. చీకటి వెనుక నిజంః రాహుల్
నానమ్మ నేర్పిన ధైర్యం.. చీకటి వెనుక నిజంః రాహుల్
తెలంగాణ DOST 2026 రిజిస్ట్రేషన్లు ప్రారంభం..జులై 1 నుంచి తరగతులు
తెలంగాణ DOST 2026 రిజిస్ట్రేషన్లు ప్రారంభం..జులై 1 నుంచి తరగతులు
అక్షయ తృతీయ రోజే అక్షయ యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం
అక్షయ తృతీయ రోజే అక్షయ యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం
ఏసీ కూలింగ్ సరిగ్గా రావడం లేదని టెక్నిషియన్‌ను పిలిచారు.. తర్వాత
ఏసీ కూలింగ్ సరిగ్గా రావడం లేదని టెక్నిషియన్‌ను పిలిచారు.. తర్వాత
ఈ సింపుల్ టిప్స్ మీకు తెలిస్తే సమ్మర్‌లోనూ ఇంటిని కూల్‌గా ఉంచోచ్చ
ఈ సింపుల్ టిప్స్ మీకు తెలిస్తే సమ్మర్‌లోనూ ఇంటిని కూల్‌గా ఉంచోచ్చ
జర భద్రం! ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన 7 ఆహార పదార్థాలు ఇవే..
జర భద్రం! ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన 7 ఆహార పదార్థాలు ఇవే..