ఇవాళ్టి నుంచి తెరుచుకున్న కంటోన్మెంట్‌ రోడ్లు

కంటోన్మెంట్‌ రహదారులపై ఆంక్షలను ఎత్తివేశారు సికింద్రాబాద్ మిలిటరీ అధికారులు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా జూలై 18 నుండి 28 జూలై 2020 వరకు రహదారులను తాత్కాలికంగా మూసివేసిన కంటోన్మెంట్‌ అధికారులు రోడ్లను తెరుస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.

ఇవాళ్టి నుంచి తెరుచుకున్న కంటోన్మెంట్‌ రోడ్లు
Follow us

|

Updated on: Jul 29, 2020 | 7:05 AM

కంటోన్మెంట్‌ రహదారులపై ఆంక్షలను ఎత్తివేశారు సికింద్రాబాద్ మిలిటరీ అధికారులు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా జూలై 18 నుండి 28 జూలై 2020 వరకు రహదారులను తాత్కాలికంగా మూసివేసిన కంటోన్మెంట్‌ అధికారులు రోడ్లను తెరుస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.ఈ తాజా నిర్ణయం మేరకు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రాంతంలో ఉన్న 25 రోడ్లపై ఆంక్షలు ఎత్తివేయనున్నారు. 29 జూలై ఉదయం 6 గంట నుండి కంటోన్మెంట్‌లోని రోడ్లు తెరుచుకోనున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలు సాగిస్తున్న లక్షలాది మందికి ఉపశమనం లభించనుంది. కంటోన్మెంట్‌లోని అన్ని రహదారులపై ఆంక్షలను ఎత్తివేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, కరోనా కేసులు పెరుగుతుండడంతో అత్యవసర పరిస్థితుల దృష్ట్యా రోడ్లను తెరుస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే కొవిడ్ కట్టడిలో భాగంగా శానిటైజ్ చేయడంలో భాగంగా ఉదయం 5:30 గంటల నుంచి 8:30 గంటల వరకు తిరిగి సాయంత్రం 4:30 గంటల నుండి 6:30 గంటల వరకు రోడ్లను మూసివేస్తున్నట్లు తెలిపింది. కంటోన్మెంట్ ప్రాంతాల్లో ప్రయాణించేవారు సరియైన ధృవీకరణ పత్రాలను కలిగి ఉండాలని ఓ ప్రకటనలో అధికారులు పేర్కొన్నారు.