మహిళా గ్రామ వాలంటీర్​పై వృద్ధుడి అసభ్య ప్రవర్తన..నిర్భయ కేసు న‌మోదు

పెన్ష‌న్ తీసుకునే వ‌య‌సు వచ్చినా కూడా ఆ వృద్ధుడు మ‌న‌సులోనుంచి పాడు ఆలోచ‌న‌లు పోలేదు. విధులు నిమిత్తం వెళ్లిన మ‌హిళా గ్రామ వాలంటీర్ ముందు త‌న పైత్యం ప్ర‌ద‌ర్శించాడు.

మహిళా గ్రామ వాలంటీర్​పై వృద్ధుడి అసభ్య ప్రవర్తన..నిర్భయ కేసు న‌మోదు
Follow us

|

Updated on: Jul 29, 2020 | 7:03 AM

Old man attempts rape on woman grama volunteer :పెన్ష‌న్ తీసుకునే వ‌య‌సు వచ్చినా కూడా ఆ వృద్ధుడు మ‌న‌సులోనుంచి పాడు ఆలోచ‌న‌లు పోలేదు. విధులు నిమిత్తం వెళ్లిన మ‌హిళా గ్రామ వాలంటీర్ ముందు త‌న పైత్యం ప్ర‌ద‌ర్శించాడు. అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. దీంతో ఇప్పుడు ఊచ‌లు లెక్క‌బెడుతున్నాడు.

వివ‌రాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా పామిడి మండలం ఎదురూరు గ్రామంలో.. గ్రామ వాలంటీర్​గా సేవ‌లందిస్తోన్న‌ ఓ మహిళపై.. రామకృష్ణ(62) అనే వ్య‌క్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఇబ్బందిప‌డ్డ వాలంటీర్ ఇంటికి వెళ్లి తన భర్తకు విషయాన్ని చెప్పింది. ఆగ్ర‌హించిన‌ మహిళ భర్త కేశవ.. రామకృష్ణ ఇంటికి వెళ్లి నిలదీశాడు. అయితే ఎదురుదాడికి దిగిన రామకృష్ణ, అతని కుమారులు కలిసి గ్రామ వాలంటీర్ భర్తపై రాళ్లతో దాడికి దిగారు. దీంతో మ‌హిళా గ్రామ వాలంటీర్.. పామిడి పోలీసులను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన పోలీసులు.. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వృద్ధుడిపై నిర్భయ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కాగా ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు చేరువ చేయ‌డంతో పాటు క‌రోనా స‌మ‌యంలో అత్యంత కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోన్న వాలంటీర్ పై ఈ త‌ర‌హా దాడి జ‌ర‌గడం ప‌ట్ల స్థానికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Read More :  షాకింగ్..వ్య‌క్తి పొత్తి క‌డుపులో 20 సెం.మీ పొడ‌వైన క‌త్తి…

మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..
ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..