‘ఫొని’ తుఫాన్ బాధితులకు అక్షయ్ రూ.కోటి విరాళం

ఉగ్రరూపం దాల్చిన ‘ఫొని’ తుఫాన్… ఒడిశాలో బీభత్సం చేసిన సంగతి విదితమే. తుఫాన్‌ తీరం దాటిన సమయంలో గంటకు 200 కి.మీ. వేగంతో గాలులు వీయడంతో భారీ విధ్వంసం చోటుచేసుకుంది. ఒడిశాలో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఫొని తుఫాన్ కారణంగా ఆ రాష్ట్రంలో 34 మంది మరణించారు. వేలాది విద్యుత్, టెలిఫోన్ స్తంభాలు నేలకూలడంతో కమ్యూనికేషన్ వ్యవస్థ నిలిచిపోయింది. తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న ఒడిశాను ఆదుకోవడానికి పలువురు ప్రముఖులు ముందుకొస్తున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ […]

'ఫొని' తుఫాన్ బాధితులకు అక్షయ్ రూ.కోటి విరాళం
Follow us

| Edited By:

Updated on: May 07, 2019 | 2:47 PM

ఉగ్రరూపం దాల్చిన ‘ఫొని’ తుఫాన్… ఒడిశాలో బీభత్సం చేసిన సంగతి విదితమే. తుఫాన్‌ తీరం దాటిన సమయంలో గంటకు 200 కి.మీ. వేగంతో గాలులు వీయడంతో భారీ విధ్వంసం చోటుచేసుకుంది. ఒడిశాలో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఫొని తుఫాన్ కారణంగా ఆ రాష్ట్రంలో 34 మంది మరణించారు. వేలాది విద్యుత్, టెలిఫోన్ స్తంభాలు నేలకూలడంతో కమ్యూనికేషన్ వ్యవస్థ నిలిచిపోయింది. తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న ఒడిశాను ఆదుకోవడానికి పలువురు ప్రముఖులు ముందుకొస్తున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ భూరి విరాళం ప్రకటించి తన పెద్ద మనసు చాటుకున్నారు.

ఫొని తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ఒడిశాకు అక్షయ్‌ కుమార్‌.. కోటి రూపాయాల విరాళాన్ని అందించారు. ఒడిశా సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఈ మొత్తాన్ని పంపించారు. గతంలో కేరళ, చెన్నైలో తుఫాన్ బీభత్సం చేసినప్పుడు కూడా అక్షయ్‌ తన వంతు సాయం చేశారు. అంతేకాదు ‘భారత్ కే వీర్‌’ వెబ్‌సైట్‌ ద్వారా ఆయన జవాన్ల కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..