కశ్మీర్‌లో పర్యటన అనంతరం ఢిల్లీ చేరుకున్న అజిత్ దోవల్
జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ కశ్మీర్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దు తర్వాత .. కశ్మీర్‌లోని పరిస్థితులను సమీక్షించేందుకు ఆగస్టు 6వ తేదీన దోవల్ అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే. దాదాపు 10 రోజులపాటు క్షేత్ర స్థాయిలో పర్యటించిన దోవల్.. అక్కడ వివిధ వర్గాల వారితో చర్చలు జరిపారు. అలాగే ఉగ్ర ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భద్రత బలగాలకు సూచనలు చేశారు. అలాగే అక్కడి పరిస్థితులను […]

Ajit Doval
జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ కశ్మీర్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దు తర్వాత .. కశ్మీర్‌లోని పరిస్థితులను సమీక్షించేందుకు ఆగస్టు 6వ తేదీన దోవల్ అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే. దాదాపు 10 రోజులపాటు క్షేత్ర స్థాయిలో పర్యటించిన దోవల్.. అక్కడ వివిధ వర్గాల వారితో చర్చలు జరిపారు. అలాగే ఉగ్ర ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భద్రత బలగాలకు సూచనలు చేశారు. అలాగే అక్కడి పరిస్థితులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.