‘డ‌బుల్ సీక్వెల్స్‌’తో ముస్తాబ‌వుతోన్న ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌’!

కామెడీ, సస్పెన్స్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. ‘షెర్లాక్ హోమ్స్ ఫిక్షనల్ క్యారెక్టర్రా.. కానీ ఈ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఒరిజినల్’ అనే డైలాగ్‌తో కొత్త ఒరవడి సృష్టించాడు నవీన్ పొలిశెట్టి. పోలీసులకు కూడా అంతుచిక్కని..

'డ‌బుల్ సీక్వెల్స్‌'తో ముస్తాబ‌వుతోన్న 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌'!

కామెడీ, సస్పెన్స్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. ‘షెర్లాక్ హోమ్స్ ఫిక్షనల్ క్యారెక్టర్రా.. కానీ ఈ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఒరిజినల్’ అనే డైలాగ్‌తో కొత్త ఒరవడి సృష్టించాడు నవీన్ పొలిశెట్టి. పోలీసులకు కూడా అంతుచిక్కని కేసుల్ని ఛేదించే ఏజెంట్‌గా నవీన్ నటన ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. మరి ఇలాంటి చిత్రానికి కొనసాగింపు రూపొందితే.. అంచనాలు భారీగా ఉంటాయి. దాంతో అంతకు మించిన కథను సిద్ధం చేసే ప‌నిలో ప‌డింది చిత్ర బృందం. గతేడాది విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. నవీన్ పొలిశెట్టి హీరోగా మొదటిసారి ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అలాగే ఈ సినిమాకి స్వరూప్ ఆర్ఎస్‌జే దర్శకత్వం వహించారు.

ఇప్ప‌టికే ఈ సినిమాకి సంబంధించిన హిందీ రీమేక్ హ‌క్కులు కూడా భారీ రేటుకు అమ్ముడు పోయిన విష‌యం తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ సినిమాకి రెండు భాగాలు తీసేందుకు ద‌ర్మ‌క నిర్మాత‌లు సిద్ధ‌మ‌వుతున్నారు. సీక్వెల్ స్క్రిప్ట్ పనులు పూర్త‌యిన‌ట్లు నిర్మాత రాహుల్ యాద‌వ్ వెల్ల‌డించారు. ప్ర‌స్తుత ఈ సినిమా హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళంలో రీమేక్ అవుతుంది. సెప్టెంబ‌ర్ 11న జ‌పాన్‌లో అనువాద చిత్రంగా విడుద‌ల కానుంది.

Read More:

కేంద్ర మంత్రి అమిత్‌షాకు క‌రోనా పాజిటివ్‌

వాట్సాప్‌లో అదిరిపోయే అప్‌డేట్‌.. 138 కొత్త ఎమోజీలు..

‘క్యాస్టింగ్ కౌచ్’‌పై న‌టి ప్ర‌గ‌తి సంచ‌ల‌న కామెంట్స్..

సీఎం జ‌గ‌న్‌కు చెన్నైవాసి అరుదైన కానుక‌.. బంగారు, వెండితో మ‌సీదు!

Click on your DTH Provider to Add TV9 Telugu