Volunteers: కూటమి ప్రభుత్వంలో వాలంటీర్ల పొజిషన్ ఏంటి? నిరసనలతో లాభం ఉందా..?

ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి. ఉద్యోగ భద్రత కల్పించండి.. అనే నినాదంతో వాలంటీర్లు నిరసన బాట పట్టారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే మున్ముందు ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామంటున్నారు. ఇంతకీ కూటమి ప్రభుత్వంలో వాలంటీర్ల పొజిషన్ ఏంటి? మున్ముందు సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది.

Volunteers: కూటమి ప్రభుత్వంలో వాలంటీర్ల పొజిషన్ ఏంటి? నిరసనలతో లాభం ఉందా..?
Volunteers Protest
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 02, 2025 | 7:59 PM

వైసీపీ హయాంలో ఏపీలో వాలంటీర్ల సేవలను ప్రభుత్వం వినియోగించుకుంది. పెన్షన్ల పంపిణీ దగ్గర నుంచి అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో వాలంటీర్లను వినియోగించుకున్నారు. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తైంది. ఇంత వరకు వాలంటీర్ల విషయంలో సరైన స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో వాళ్లు ఆందోళన బాట పట్టారు. మూడు రోజుల నిరసనల్లో భాగంగా ఇవాళ గ్రామ, వార్డు సచివాలయం అడ్మిన్‌లకు వాలంటీర్లు వినతి పత్రాలు ఇచ్చారు.

విజయవాడలో ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వాలంటీర్లు నిరసన తెలిపారు. ఆందోళనలో భాగంగా స్థానికంగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని నీటితో కడిగి.. ఆ విగ్రహం ముందు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎన్టీఆర్ విగ్రహానికి అందించారు.

ఉద్యోగ భద్రత కల్పించాలి.. పెండింగ్ వేతనాలు చెల్లించాలనేది వాలంటీర్ల ప్రధాన డిమాండ్. కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామంటున్నారు వాలంటీర్లు.

జనవరి 03న మోకాళ్ల మీద కూర్చుని భిక్షాటన… జనవరి 04న బ్యాక్ టూ వాక్

ఇక జనవరి 03న అన్ని జిల్లా కేంద్రాల్లో మోకాళ్ల మీద కూర్చుని భిక్షాటన చేపట్టనున్నారు. జనవరి 04న బ్యాక్ టూ వాక్ పేరుతో వాలంటీర్లు వెనక్కి నడుస్తూ నిరసన తెలపబోతున్నారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు కాబట్టే ఇప్పుడు అడుగుతున్నాం. వాలంటీర్లను మళ్ళీ విధుల్లోకి తీసుకుని న్యాయం చేయండి అంటూ నిరసనకు దిగారు వాలంటీర్లు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి