ధోని ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్..!
క్రికెట్ ఫ్యాన్స్‌కు సూపర్ గుడ్ న్యూస్. త్వరలోనే మహేంద్ర సింగ్ ధోని ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. తన సొంత బ్యానర్ 'ధోని ఎంటర్టైన్మెంట్స్'ను 2019లో లాంచ్ చేసిన ధోని..

Dhoni To Turn A Producer: క్రికెట్ ఫ్యాన్స్‌కు సూపర్ గుడ్ న్యూస్. త్వరలోనే మహేంద్ర సింగ్ ధోని ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. తన సొంత బ్యానర్ ‘ధోని ఎంటర్టైన్మెంట్స్’ను 2019లో లాంచ్ చేసిన ధోని.. ఇప్పటికే ‘ రోర్ అఫ్ ది లయన్’ అనే డాక్యుమెంటరీని నిర్మించాడు. వచ్చే ఏడాది మరిన్ని వెబ్‌సిరీస్‌లు నిర్మించాలని ప్లాన్‌లో ఉన్నాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని ధోని సతీమణి సాక్షి తాజాగా మీడియాతో వెల్లడించింది.
‘మేము ‘రోర్ అఫ్ ది లయన్’ తీస్తున్నప్పుడు వినోద పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు ఇదే మంచి సమయంలో అనుకున్నాం. ప్రతిభావంతులను మా బ్యానర్ ద్వారా ప్రోత్సహించడమే కాకుండా.. ఫ్రెష్ అండ్ ఒరిజినల్ కంటెంట్‌ను ప్రేక్షకులకు అందించాలని అనుకుంటున్నాం. ధోని కూడా ప్రొడక్షన్ హౌస్ కార్యకలాపాలను చూసుకుంటున్నాడు’ అని సాక్షి తెలిపింది. కాగా, ఆగష్టు 15వ తేదీన మహేంద్ర సింగ్ ధోని తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పగా.. ప్రస్తుతం ఐపీఎల్ 2020లో చెన్నై టీమ్‌కు సారధ్యం వహిస్తున్నాడు.
Also Read: