గురుకుల పాఠశాలల్లో.. లాటరీ పద్ధతిలో అడ్మిషన్లు..

| Edited By:

Jun 18, 2020 | 2:09 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి 213 దేశాలకు పాకింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు లాక్ డౌన్ సడలింపులతో జనజీవనం తిరిగి ప్రారంభమైంది. ఈ క్రమంలో

గురుకుల పాఠశాలల్లో.. లాటరీ పద్ధతిలో అడ్మిషన్లు..
Follow us on

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి 213 దేశాలకు పాకింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు లాక్ డౌన్ సడలింపులతో జనజీవనం తిరిగి ప్రారంభమైంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ(ఏపీఆర్‌ఇఐఎస్‌) కింద నిర్వహిస్తోన్న 50 గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ల విధానం మారింది. గతేడాది వరకు అమల్లో ఉన్న స్ర్కీనింగ్‌ టెస్ట్‌ను అధికారులు ఉపసంహరించారు.

కాగా.. 2020-21 విద్యా సంవత్సరపు 5వ తరగతి అడ్మిషన్లకు లాటరీ పద్ధతిని అమలు చేయనున్నారు. అలాగే 6-7 తరగతుల బ్యాక్‌లాగ్‌ అడ్మిషన్లకు లాటరీ పద్ధతినే అమలు చేస్తారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలతో పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. కలెక్టర్లు ఆయా తరగతుల అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టేందుకు జిల్లాస్థాయిలో ఎంపిక కమిటీ(డీఎస్సీ)లను ఏర్పాటు చేస్తారు.