గాడిలో పడుతున్న రైల్ గాడి..అదనంగా 12 ప్రత్యేక రైళ్లు

రైల్వే శాఖ.. మరో అడుగు ముందుకు వేసింది. ఈ నెల 12 నుంచి పశ్చిమ రైల్వేలో అదనంగా 12 ప్రత్యేక రైళ్లను పునరుద్ధరించనున్నారు...

గాడిలో పడుతున్న రైల్ గాడి..అదనంగా 12 ప్రత్యేక రైళ్లు
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 06, 2020 | 9:31 PM

కరోనా నుంచి నెమ్మదిగా బయట పడుతోంది రైల్వే వ్యవస్థ.. ఒక్కొక్క రైలును పట్టాలు ఎక్కిస్తోంది. మొన్న దేశ వ్యాప్తంగా 100 ప్యాసింజర్ రైళ్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించిన రైల్వే శాఖ.. మరో అడుగు ముందుకు వేసింది. ఈ నెల 12 నుంచి పశ్చిమ రైల్వేలో అదనంగా 12 ప్రత్యేక రైళ్లను పునరుద్ధరించనున్నారు.

ఆరు మార్గాల్లో ఆరు జతల చొప్పున 12 ప్రత్యేక రైళ్లు ఈ నెల 12 నుంచి తదుపరి ఉత్తర్వుల వరకు నడుస్తాయని పశ్చిమ రైల్వే పీఆర్వో తెలిపారు. దేశవ్యాప్తంగా పలు ప్రవేశ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం పలు జోన్లలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. కాగా ఆదివారంతో జేఈఈ మెయిన్స్, ఎన్డీఏ పరీక్షలు ముగిశాయి. ఈ నెల 13న నీట్ జరుగనున్నది. ఈ నేపథ్యంలో పశ్చిమ రైల్వేతోపాటు పలు జోన్లలో ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు. ఇలా వ్యవస్థను గాడీలో పడుతున్నారు అధికారులు.