AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రియ బర్త్ డే గిఫ్ట్.. ‘గ‌మ‌నం’ ఫ‌స్ట్ లుక్ రిలీజ్!

తెలుగుతెర అందాలరాశి 'శ్రియ' పుట్టినరోజు ఇవాళ. తన అపురూప అందం, అభినయంతో నటి శ్రియ శ‌ర‌ణ్‌ దాదాపు రెండు దశాబ్దాల పాటు టాలీవుడ్ తో పాటు పలు చిత్రసీమల్లో ప్రేక్షకులను అలరించించింది. పెళ్లి తర్వాత సినిమాలకి కాస్తా బ్రేక్ ఇచ్చిన..

శ్రియ బర్త్ డే గిఫ్ట్.. 'గ‌మ‌నం' ఫ‌స్ట్ లుక్ రిలీజ్!
Pardhasaradhi Peri
|

Updated on: Sep 11, 2020 | 2:24 PM

Share

తెలుగుతెర అందాలరాశి ‘శ్రియ’ పుట్టినరోజు ఇవాళ. తన అపురూప అందం, అభినయంతో నటి శ్రియ శ‌ర‌ణ్‌ దాదాపు రెండు దశాబ్దాల పాటు టాలీవుడ్ తో పాటు పలు చిత్రసీమల్లో ప్రేక్షకులను అలరించించింది. పెళ్లి తర్వాత సినిమాలకి కాస్తా బ్రేక్ ఇచ్చిన శ్రియ మళ్ళీ కెమరా ముందుకు వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మూవీ యూనిట్ ఆమె తాజా సినిమా ‘గమనం’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ ని దర్శకుడు క్రిష్ రిలీజ్ చేయగా మూవీ యూనిట్ తోపాటు, అనేక మంది సెలబ్రెటీలు దీనిని షేర్ చేస్తూ శ్రియకు శుభాకాంక్షలు చెబుతున్నారు. పోస్టర్ లో శ్రియ చీర క‌ట్టుకొని, మెడ‌లో మంగ‌ళ‌సూత్రం వేసుకొని ఓ సాధారణ గృహిణి లాగా కనిపిస్తుంది. ఈ సినిమాలో శ్రియనే కీలకమని.. సినిమాలో ఆమె ఒక విభిన్నమైన పాత్రను పోషిస్తున్నట్టుగా చెప్పకనే చెబుతుంది ఫస్ట్ లుక్. సుజ‌నా రావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని తెలుగు, త‌మిళ‌, క‌న్నడ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి మాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతం అందిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా మాటలు. ర‌మేష్ క‌రుటూరి, వెంకీ పుష‌డ‌పు, జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్‌. నిర్మాతలు. ఇప్పటికే దాదాపుగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇందులో శ్రియతో పాటుగా శివ కందుకూరి, నిత్యామీనన్‌, ప్రియాంక జువాల్కర్‌ వంటి ప్రముఖ నటులు కీలక పాత్ర పోషిస్తున్నారు.

Follow Us
పాన్ ఇండియాలోనే తోపు హీరో.. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే..
పాన్ ఇండియాలోనే తోపు హీరో.. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే..
ఆ ముగ్గురు హీరోలు చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేను..
ఆ ముగ్గురు హీరోలు చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేను..
సినిమా అంటే చాలు రాత్రి, పగలు కష్టపడుతూనే ఉంటాడు.. కృష్ణ భగవాన్..
సినిమా అంటే చాలు రాత్రి, పగలు కష్టపడుతూనే ఉంటాడు.. కృష్ణ భగవాన్..
ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. 25వ సినిమాకే..
ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. 25వ సినిమాకే..
స్వీట్లపై మెరిసేదంతా వెండే అనుకుంటున్నారా?.. మోసపోయినట్టే!
స్వీట్లపై మెరిసేదంతా వెండే అనుకుంటున్నారా?.. మోసపోయినట్టే!
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72
నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..
నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..
వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్
వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్
వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?
వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?
ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..
ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..