అమరావతి ఎంపీ, నటి నవనీత్ రాణాకు కరోనా పాజిటివ్‌..!

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహహ్మరికి వాళ్లు, వీళ్లు అనే తేడా లేకుండా అందర్నీ అంటుకుంటుంది. దేశంలో కొవిడ్ బారినపడుతున్న ప్రముఖుల జాబితా పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు వైరస్ సోకి ఆస్పత్రుల పాలవుతున్నారు. తాజాగా సినీ నటి, ఎంపీ నవనీత్ రాణాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటికే ఆమె నివాసంలోని 11 మంది కరోనా బారిన పడ్డారు.

అమరావతి ఎంపీ, నటి నవనీత్ రాణాకు కరోనా పాజిటివ్‌..!
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 06, 2020 | 6:54 PM

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహహ్మరికి వాళ్లు, వీళ్లు అనే తేడా లేకుండా అందర్నీ అంటుకుంటుంది. దేశంలో కొవిడ్ బారినపడుతున్న ప్రముఖుల జాబితా పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు వైరస్ సోకి ఆస్పత్రుల పాలవుతున్నారు. తాజాగా సినీ నటి, ఎంపీ నవనీత్ రాణాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటికే ఆమె నివాసంలోని 11 మంది కరోనా బారిన పడ్డారు. తొలుత నవనీత్ మామ గంగాధర్ రానాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో.. నవనీత్‌కు, ఆమె భర్తకు కరోనా టెస్టులు నిర్వహించారు. దాదాపు 60 మంది కుటుంబసభ్యులు, కార్యకర్తలకు కరోనా పరీక్షలు నిర్వహించారు. నవనీత్ కౌర్ ఇంటి ప్రాంగణాన్ని వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా శానిటైజ్ చేశారు మునిపల్ సిబ్బంది. అయితే.. నవనీత్ రానా, ఆమె భర్త రవిరానా శాంపిల్స్ వైద్యులు తప్పుగా తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై.. వైద్యఆరోగ్య శాఖకు రవి రానా ఫిర్యాదు చేశారు. దీంతో.. మళ్లీ వీరిద్దరి శాంపిల్స్‌ తీసుకున్నారు. నవనీత్ రిపోర్ట్‌లో రిజల్ట్ పాజిటివ్‌గా తేలింది. నవనీత్ ప్రస్తుతం మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, కుటుంబసభ్యులకు కరోనా టెస్టులు చేయిస్తున్న వీడియోను ట్వీట్టర్ లో నవనీత్ స్వయంగా పోస్టు చేశారు. దేవుడా.. త్వరలోనే ఈ కరోనా మహమ్మారి నుండి అందరినీ రక్షించండి అంటూ ట్వీట్ చేశారు.