కర్ణాటకలో కరోనా కల్లోలం.. కొత్తగా 5,619 కరోనా కేసులు!

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకి కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రంలో పాజిటివ్‌కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండగా, మరణాలు అంతకంతకూ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఇవాళ ఒక్కరోజే

కర్ణాటకలో కరోనా కల్లోలం..  కొత్తగా 5,619 కరోనా కేసులు!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 06, 2020 | 6:48 PM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకి కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రంలో పాజిటివ్‌కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండగా, మరణాలు అంతకంతకూ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఇవాళ ఒక్కరోజే ఆ రాష్ట్రంలో కొత్తగా 5,619 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో ఇప్పటివరకు 1,51,449 మంది కరోనా వైరస్‌ బారినపడగా 73,958 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 74,679 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జ్ కాగా 2,804 మంది మృతి చెందారని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో సగటు రికవరీ రేటు 49.3 శాతంగా ఉందని పేర్కొంది.

Read More:

తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం.. 21 రోజుల్లో ఇంటి అనుమతులు..!

దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ!