‘సోలో బ్రతుకే సో బెటర్’ ట్రైలర్.. నటుడు ఆర్ నారాయణ మూర్తికి అత్యంత ప్రాముఖ్యత
సాయిధరమ్ తేజ్, నభా నటేశ్ జంటగా తెరకెక్కిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. తక్కువ సమయంలోనే ఈ ట్రైలర్ 4 మిలియన్ల...

సాయిధరమ్ తేజ్, నభా నటేశ్ జంటగా తెరకెక్కిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. తక్కువ సమయంలోనే ఈ ట్రైలర్ 4 మిలియన్ల వ్యూస్ సాధించడం విశేషం. పెళ్లికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుని సోలోగా బతకాలనుకున్న ఓ యువకుడి కథ ఇదీ.. అనేలా ట్రైలర్ కట్ చేశారు. నభా నటేష్ అందాలు, రావు రమేష్ డైలాగులతోపాటు, రాజేంద్రప్రసాద్, నరేష్ కూడా ట్రైలర్ లో సందడి చేశారు. లవ్ అంట్ ఎంటర్టైన్‌మెంట్ కథాంశంతో తెరకెక్కిన ఈ సోలో బ్రతుకే సో బెటర్ చిత్రానికి సుబ్బు దర్శకత్వం వహించగా.. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై జీ స్టూడియోస్ భాగస్వామ్యంతో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని డిసెంబరు 25న థియేటర్లల్లో విడుదల చేయబోతున్నారు. ఇదంతా ఒకెత్తయితే, ప్రముఖ విప్లవ నటుడు ఆర్ నారాయణ మూర్తికి ఈ సినిమాలో అత్యంత ప్రాముఖ్యత ఇవ్వడం ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది.



