AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రహ్మాజీ తన ట్విట్టర్ అకౌంట్ అందుకే డిలీట్ చేశాడా…

హైదరాబాద్‌లో జోరుగా కురుస్తున్న వర్షాలకు తన ఇల్లు నీటిలో మునిగిపోయిందని టాలీవుడ్ న‌టుడు బ్ర‌హ్మాజీ తన ట్విట‌ర్‌లో పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. వ‌ర‌ద నీటిలో త‌న ఇల్లు ఉన్న ఫొటోల‌తోపాటు...

బ్రహ్మాజీ తన ట్విట్టర్ అకౌంట్ అందుకే డిలీట్ చేశాడా...
Sanjay Kasula
|

Updated on: Oct 20, 2020 | 6:34 PM

Share

Actor Brahmaji :హైదరాబాద్‌లో జోరుగా కురుస్తున్న వర్షాలకు తన ఇల్లు నీటిలో మునిగిపోయిందని టాలీవుడ్ న‌టుడు బ్ర‌హ్మాజీ తన ట్విట‌ర్‌లో పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. వ‌ర‌ద నీటిలో త‌న ఇల్లు ఉన్న ఫొటోల‌తోపాటు… చిన్న సెటైర్‌ను కూడా బ్రహ్మాజీ జత చేశారు. అందులో.. తాను బోటు కొనాల‌నుకుంటున్నాన‌ని స‌ర‌దాగా కామెంట్ పెట్ట‌డంతో.. బ్ర‌హ్మాజీ వ్యాఖ్య‌ల‌పై కొంత‌మంది నెటిజ‌న్లు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ.. కామెంట్స్ పెట్టారు. దీంతో ముందుగా ఆ ఫోటోలను డిలీట్ చేశాడు. అయితే నెటిజన్ల కామెంట్స్ పెరిగిపోతుంటంతో త‌న ట్విట‌ర్ అకౌంట్ ను డిలీట్ చేశాడు బ్ర‌హ్మాజీ. ట్విట‌ర్ ఖాతాను తొల‌గించడానికి గ‌ల కార‌ణాన్ని కూడా బ్రహ్మాజీ వివ‌రించాడు.

’నేను, నా కుమారుడు ఆ స‌మ‌యంలో బ‌య‌టి నుంచి ఇంటికి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చాం. చాలా వ‌ర‌ద నీరు ఇంటిని చుట్టుముట్టింది. వ‌ర‌ద ఉధృతి కూడా ఎక్కువే ఉంది. నా ఇంటి ద‌గ్గ‌ర‌కు కారు వెళ్లే ప‌రిస్థితి లేదు. దీంతో స‌మీపంలోని కాల‌నీ వాసుల‌ను అడిగి కారు అక్క‌డే పార్కు చేశాను. నేను నా భార్య ఇంటికి న‌డుచుకుంటూ వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నాం. అయితే వ‌ర‌ద ఎక్కువ‌గా ఉండ‌టంతో.. కొంత‌ మంది స్థానికులు వ‌చ్చి మేం ఇంటికి సుర‌క్షితంగా వెళ్లేలా సాయం చేశారు. బేస్ మెంట్‌లో కూడా వ‌ర‌ద ప్ర‌వాహం ఎక్కువ‌గా ఉంది. అప్పు‌డే నేను బోటును కొనాల‌నుకుంటున్నాన‌ని’ ట్విట‌ర్ లో చిన్న జోక్ వేశాన‌ని బ్ర‌హ్మాజీ రాసుకొచ్చారు. తాను ఎప్పుడైనా హైద‌రాబాద్‌, చెన్నై, బెంగ‌ళూరు, ఢిల్లీలో ఉన్న‌పుడు ఇలాంటివి త‌న‌పై తానే జోకులు వేసుకుంటాన‌ని బ్రహ్మాజీ పేర్కొన్నారు.

Follow Us
రాశిఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో గుడ్‌న్యూస్
శరన్నవరాత్రులు: ఐదో రోజు స్కందమాతను ఎందుకు పూజిస్తారు? ఆమె అవతారం
శరన్నవరాత్రులు: ఐదో రోజు స్కందమాతను ఎందుకు పూజిస్తారు? ఆమె అవతారం
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ట్విస్ట్.. ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ట్విస్ట్.. ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్
వెస్టిండీస్ సంచలనం.. భారత్‌పై 24 పరుగుల విజయం.. సిరీస్ సమం
వెస్టిండీస్ సంచలనం.. భారత్‌పై 24 పరుగుల విజయం.. సిరీస్ సమం
సింహాలతో సీతక్క సవారీ.. మామూలుగా లేదుగా!
సింహాలతో సీతక్క సవారీ.. మామూలుగా లేదుగా!
లంచ్ బాక్స్ లోకి టమాటో రైస్ రుచిగా.. 10 నిమిషాల్లోనే ఇలా ఈజీగా..
లంచ్ బాక్స్ లోకి టమాటో రైస్ రుచిగా.. 10 నిమిషాల్లోనే ఇలా ఈజీగా..
బెంగాల్‌లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
బెంగాల్‌లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
H-1B వీసాదారులకు మరో షాక్.. రెన్యూవల్‌కు కొత్త నిబంధనలు
H-1B వీసాదారులకు మరో షాక్.. రెన్యూవల్‌కు కొత్త నిబంధనలు
యూపీఐ ఛార్జీల అమలుపై కేంద్రం కీలక నిర్ణయం
యూపీఐ ఛార్జీల అమలుపై కేంద్రం కీలక నిర్ణయం
'విజయ్' పేరును స్టాలిన్'గా మార్చిన AI.. నెట్టింట రచ్చ!
'విజయ్' పేరును స్టాలిన్'గా మార్చిన AI.. నెట్టింట రచ్చ!